అందరికీ.. అదే చెప్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదువు తరువాత టెన్ టు ఫైవ్ ఉద్యోగాలు ఇష్టంలేకే తిరిగి తిరిగి ఇండస్ట్రీవైపు వచ్చాను. ఇప్పుడు మళ్లీ మళ్లీ కామెడీ సినిమాలే చేయాలంటే నా వల్లకాదు. అందుకే డిఫరెంట్ జోనర్లలోని వైవిథ్యమైన పాత్రలపై దృష్టి పెడుతున్నా -అంటున్నాడు నటుడు అభినవ్ గోమఠం
తరుణ్ భాస్కర్, వాణీభోజన లీడ్‌రోల్స్‌గా దర్శకుడు షామీర్ సుల్తాన్ తెరకెక్కించిన సినిమా -మీకు మాత్రమే చెప్తా. అనసూయ ముఖ్య పాత్ర పోషిస్తోంది. విజయ్ దేవరకొండ, వర్దన్ దేవరకొండ నిర్మాతలు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అభినవ్ సోమవారం మీడియాతో మాట్లాడాడు.
కథను -షామిర్ సులాన్, అర్జున్ అద్భుతంగా రాసుకున్నారు. చాలా సినిమాలకు చెప్పే మాటే అయినా -జెన్యూన్‌గా చెప్పాలంటే రెగ్యులర్ సినిమాలకు ఇది భిన్నం.
మీకు మాత్రమే చెప్తా -ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్, అందులో చూపించింది చాలా తక్కువ. ఓ సినిమాకు ట్రైలర్ ఇవ్వాలన్న కానె్సప్ట్‌తో చేసిందే అది. నిజానికి సినిమాలో విషయం చాలావుంది.
ఎవరికీ చెప్పొద్దు -అన్నది ఫస్ట్ అనుకున్న టైటిల్. కాకపొతే ఆ టైటిల్‌తో సినిమా వచ్చేసింది. ఎవరికీ చెప్పొద్దు అన్న విషయానే్న ఇంకోలా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నపుడు పుట్టిందే -మీకు మాత్రమే చెప్తా.
తరుణ్ లీడ్ రోల్ చేశాడు కానీ, కెరీర్‌లో తను డైరెక్షన్‌పైనే ఫోకస్ పెడుతున్నాడు. బట్, స్టోరీ అతనికి బాగా సూటైంది. పాత్రలపరంగా చూస్తే అతనే సినిమాలో లీడ్.
సినిమాలు తక్కువ చేయడానికి కారణం -అవకాశాలు రాక కాదు. డేట్స్ కారణంగా రెండు సినిమాలు సెట్టవ్వలేదంతే. ఈ నగరానికి ఏమైంది సినిమా తరువాత ‘సీత’ ప్రాజెక్టుకు ఓకే చెప్పా. బట్, అది షూట్ కొంచెం ఆలస్యమైంది. అదే టైంలో మజిలీ, డియర్ కామ్రేడ్ ప్రాజెక్టుల్లో చాన్స్ వచ్చినా -సీత డేట్స్ కోసం వదిలేసుకున్నా. ఇదీ మిస్సైయ్యేదేమో. బట్, ప్రొడ్యూసర్స్ టీం కొంచెం వెయిట్‌చేసి చాన్స్ నాకే ఇచ్చారు.
పాత్రలపరంగానూ సినిమాలో తరుణ్ నాకు ఫ్రెండ్. టీఆర్పీ కోసం న్యూస్‌చానెల్‌లో ప్రోగ్రాం చేసుకునే వీడియో జాకీలం. క్యారెక్టరైజేషన్ ప్రకారం ఓ పదేళ్ల ఫ్రెండ్స్ అన్నట్టన్నమాట.
చిన్నప్పటికీ -ఇండస్ట్రీ గురించి కలలంటూ లేవు. సినిమా అనేది -ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసే ఓ ఎంటర్‌టైన్‌మెంట్. ఇప్పుడు బహుశ సినిమాపట్ల నా దృక్పథం మారుతుందేమో.
విజయ్ ‘అర్జున్‌రెడ్డి’ ప్రాజెక్టు విడుదలకు ముందు -కో డైరెక్టర్ అర్జున్‌కృష్ణ.. షామీర్ సుల్తాన్‌తో కలిసి విజయ్‌కి స్టోరీ చెప్పారు. అర్జున్‌రెడ్డి హిట్టయితే ప్రాజెక్టు చేయలేను, బట్ ప్రొడ్యూస్ చేస్తా అని అప్పుడే చెప్పాడు. అర్జున్‌రెడ్డి హిట్టవ్వడంతో -విజయ్ ఈ ప్రాజెక్టును ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
తరువాతి ప్రాజెక్టులంటే -దర్శకుడు జయంత్ సి పరాన్జీతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది. అందులో ఓ లీడ్‌రోల్ చేస్తున్నా. చిలసౌ హీరో సుశాంత్ సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నా. అలాగే నితిన్ ఫ్యూచర్ ప్రాజెక్టు ‘రంగ్‌దే’లోనూ ఓ పాత్ర చేయబోతున్నా.
ఒకట్రెండ్ సీన్స్‌లో కనిపించే పాత్రలు నావద్దకు రావడం లేదు. అది నా అదృష్టం. ఫ్రెండ్లీ పాత్రలైనా హీరోతో సమానంగా ఉన్నవే పడుతున్నాయి. అలాగని కామెడీకై ఫిక్సైపోవాలని లేదు. అన్ని తరహా పాత్రలూ చేయాలనుకుంటున్నా.
ఈ నగరానికేమైంది -వెబ్‌సిరీస్ రెడీ అవుతోంది. తరుణ్ స్టోరీ డిజైన్ చేసేశాడు. డైలాగ్స్ రాయాలి. ఆ ప్రాజెక్టు బ్యాచే ఇక్కడా ఉంటాం. బట్, తరుణ్ ఫ్రెండ్ ఆదిత్య దీన్ని డైరెక్ట్ చేస్తాడు. కారణం -తరుణ్ భాస్కర్‌కి హీరో వెంకటేషతో ప్రాజెక్టు ఉంది.
హాలీవుడ్ సినిమాలు చూస్తున్నపుడు డైరెక్టర్ అయిపోవాలని అనిపిస్తుంది. బట్, అంతకంటే ముందు రైటింగ్ స్కిల్స్ పెంచుకోవడమే ఇష్టం. ఆ యాంగిల్‌లో ప్రయత్నిస్తున్నా.