సైలెన్స్.. యూఎస్ లేడీ కాప్ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరీర్ ప్రయోగాల కారణంగా ఆకృతి మారిపోయిన అనుష్క -మహిళా ప్రాధాన్యత చిత్రాలపైనే దృష్టి పెడుతోంది. తాజాగా ఆమెతో హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తోన్న సినిమా ‘సైలెన్స్’. వివిధ భాషల్లోకి అనువాదమవుతోన్న ఈ యూనివర్శల్ థాట్ -తెలుగులో ‘నిశ్శబ్దం’గా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయనుందన్నది తెలిసిందే. కోన వెంకట్, విశ్వప్రసాద్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. కథ ఎక్కువ భాగం యూఎస్‌లోనే షూటింగ్ జరుపుకోవడంతో -సినిమా అప్‌డేట్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. తాజా అప్‌డేట్ ఏంటంటే -నిశ్శబ్దాన్ని ఛేదించే లేడీ కాప్‌గా హీరోయిన్ అంజలి మెస్మరైజ్‌డ్ క్యారెక్టర్ చేస్తోందట.
కాప్ కటౌట్‌లో అంజలి ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అప్పుడే మొదలైంది. స్టోరీ బేస్ మొత్తం యూఎస్ కనుక -అంజలి సైతం అక్కడి కాప్ కోడ్‌లోనే కనిపిస్తుందా? కాదా? అన్న డౌట్స్ లేకపోలేదు. పాత్రకోసం బరువు తగ్గిన అంజలి.. ఈ తరహా పాత్ర ఫస్ట్‌టైం చేస్తోంది. అనుష్క తరువాత కథలో అంతటి ఇంపార్టెన్స్ వున్న పాత్ర అంజలిదేనట. ముఖ్యపాత్రల్లో మాధవన్, అవసరాల, సుబ్బరాజు, షాలినీ పాండేలు కనిపించనున్నారు.