‘రెడ్’కి గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్ తదుపరి చిత్రం -రెడ్. డైరెక్టర్ కిషోర్ తిరుమల. ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి బుధవారం గ్రీన్‌సిగ్నల్ పడింది. స్రవంతి మూవీస్ నిర్మిస్తోన్న సినిమా బుధవారం పూజాధికాలు నిర్వహించింది. నవంబర్ 16నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. రామ్ డ్యూయల్ రోల్ ప్రాజెక్టుగా కథనాలు బయటకు రావడంతో -మాళవిక శర్మ, నివేద పేతురాజ్‌ల పేర్లు హీరోయిన్లుగా వినిపిస్తున్నాయి. షార్ట్ హెయిర్‌తో సాలిడ్ మెటీరియల్ లుక్ ఇచ్చిన రామ్ -హిట్టుకొట్టిన ఇస్మార్ట్‌ను.. మించి మాసిజం చూపించనున్నాడా? అన్న చర్చ మొదలైంది. ఈ ప్రాజెక్టుకు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నాడు. కిషోర్ తిరుమలతో మూడో ప్రాజెక్టైన రెడ్ -రామ్ కెరీర్‌లో 18వ చిత్రం. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రబృందం వెల్లడించనుంది.