కొత్తగా అలా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు సుక్కూ రేంజ్ -రంగస్థలానికి ముందు వేరు. తరువాత వేరు. ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ లిస్టులో అంతకుముందూ సుక్కూ పేరున్నా.. రంగస్థలం మాత్రం పర్మినెంట్ ప్లేస్ క్రియేట్ చేసింది. ఆ స్టేటస్‌తోనే హీరో మహేష్‌కు కథ నెరేట్ చేసినా -ప్రాజెక్టు వర్కౌట్ కాలేదు. టైం వేస్ట్ చేయకుండా వెంటనే అల్లు అర్జున్‌కు కథ చెప్పాడు సుకుమార్. బన్నీ ఓకే చెప్పడంతో -ప్రాజెక్ట్ నిర్మాణానికి మైత్రి మూవీ మేకర్స్ సిద్ధమైంది. నిజానికి బన్నీ -సుకుమార్‌కు ఇది హ్యాట్రిక్ ప్రాజెక్టు. మరోపక్క అల్లు అర్జున్‌కు 20వ ప్రాజెక్టు కూడా. అందుకే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ కొత్తగా ఉంటున్నాయి. తాజా అప్‌డేట్ ఏంటంటే -ఈ సినిమాకు సుక్కూ షేర్ తీసుకోడానికి రెడీ అవుతున్నాడని. సుకుమార్ అదే ప్రస్తావన తెస్తే -యస్ చెప్పడానికీ మైత్రీ మూవీ మేకర్స్ రెడీగా ఉందట. ఇదే కనుక మెటీరియలైజ్ అయితే సుకుమార్‌కు భారీగానే లాభం చేకూరుతుంది. విడుదలకు ముందే షేర్ తీసేసుకోవడం, భారీ లాభాలు కనుక వస్తే.. మళ్లీ అందులోనూ షేర్ ఇవ్వక తప్పదు. అలాగే, అప్పటి వరకూ దర్శకుడిని ఇబ్బంది పెట్టకుండా సుక్కూకి నెలవారీ ఖర్చుల రూపంలో మైత్రీ మేకర్స్ చెల్లించేందుకూ సిద్ధంగానే ఉన్నారట. సినిమా విడుదలకు ముందు షేర్ కనుక ఇవ్వలేకపోతే -సినిమా బిజినెస్ అయిన తరువాత వడ్డీ సహా చెల్లించాల్సి ఉంటుంది. సుక్కూ ఫామ్‌లో ఉన్నాడు కనుక -ఏ లెక్కన చూసినా ఈ ప్రాజెక్టుతో దర్శకుడికి బాగానే ముట్టొచ్చన్న అంచనాలు లేకపోలేదు.