ఆ పాత్రల మధ్య సవాళ్లు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో మహేష్‌బాబు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రం -సరిలేరు నీకెవ్వరు. వచ్చే సంక్రాంతికి వస్తోన్న ఈ సినిమాకు స్పెషల్ -ఒకప్పటి లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి కీలకపాత్ర పోషిస్తుండటం. ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో విజయశాంతి రీఎంట్రీని ప్రస్తావించారు. చాలా గ్యాప్ తరువాత చేస్తున్న ప్రాజెక్టు -సరిలేరు నీకెవ్వరు. రీఎంట్రీ కావడంతో -ప్రాజెక్టులో నా పాత్రపై మీడియాలో ఏవేవో కథనాలు వచ్చేస్తున్నాయి. నిజానికి భారతి పాత్రతో హీరో మహేష్‌కు ఎలాంటి సవాళ్లూ ఉండవు. మా పాత్రల మధ్య రిలేషన్ కూడా బాగుంటుంది అన్నారు. తండ్రి కృష్ణలాగే మహేష్ కూడా సైలెంట్. తను నన్ను అమ్మాఅనో, మేడమ్ అనో అంటాడు. బాబూ, మీరు అనే నేను సంబోధిస్తాను. ఏదేమైనా ఈ ప్రాజెక్టు చేయడం హ్యాపీగా ఉంది అంటోంది విజయశాంతి. సినిమాలో మహేష్‌తో రష్మిక ఫస్ట్‌టైం జోడీ కట్టింది. తమన్నా ఓ ప్రత్యేక గీతంలో మెరవనుంది. అనిల్ సుంకర, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.