ఓ చిత్రమైన ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విరాజ్ అశ్విన్, నేహాకృష్ణ జోడీగా దర్శకుడు విఎన్ ఆదిత్య తెరకెక్కిస్తోన్న చిత్రానికి -వాళ్లిద్దరి మధ్య టైటిల్ ఖరారు చేశారు. వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అర్జున్ దాస్యన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు విఎన్ ఆదిత్య మాట్లాడుతూ -మంచి నిర్మాతతో మంచి కథపై వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మేనల్లుడు విరాజ్ అశ్విన్ కథకు ఆప్ట్‌గా దొరికిన హీరో. కథకు అనుగుణంగా అమెరికాలో చదువుకుంటున్న తెలుగమ్మాయి నేహాకృష్ణను ఎంపిక చేసుకున్నాం. పీజీ విందా వద్ద అసిస్టెంట్‌గా వర్క్ చేసిన ఆర్‌ఆర్ కోలంచిని సినిమాటోగ్రాఫర్‌గా మా సినిమాతో పరిచయం చేస్తున్నాం. ప్రతినాయకుల్లాంటి హీరో హీరోయిన్ల మధ్య పుట్టిన ప్రేమ కథ ఇది. పోస్టర్స్‌లో కనిపిస్తున్న లోమా అంటే ఏంటి? టైటిల్‌కి వీళ్ల క్యారెక్టర్లకి సంబంధం ఏమిటి? అన్న విషయాన్ని త్వరలో చెబుతాం అన్నారు. నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ -నిర్మాతగా ఇది తొలి సినిమా. కథ నచ్చి సినిమా మొదలుపెట్టాం. విఎన్ ఆదిత్య ఎక్స్‌లెంట్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి ట్రెండ్‌కి తగిన స్టోరీ. మంచి లొకేషన్స్‌లో వేగంగా నిర్మాణం పూర్తి చేస్తున్నాం. డిసెంబర్ తొలి వారానికి సినిమా మొత్తం సిద్ధమవుతుంది అన్నారు. హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ -రెండో సినిమా విఎన్ ఆదిత్యతో చేయడం హ్యాపీగా ఉంది. యూనిట్ మొత్తం కొత్తవాళ్లే అయినా ప్రాణం పెట్టి చేస్తున్నారు. స్టోరీ వింటున్నపుడే అద్భుతంగా అనిపించింది. అలాంటిది ఆదిత్య స్క్రీన్‌మీదకు తెచ్చే విధానం మరింత అద్భుతంగా ఉంది అన్నారు. హీరోయిన్ నేహా మాట్లాడుతూ -తెలుగులో తొలి చిత్రాన్ని విఎన్ ఆదిత్యతో చేయడం హ్యాపీగా ఉంది. మంచి బ్యానర్ నుంచి పరిచయమవుతున్నా. తెలుగుదనాన్ని ఆస్వాదిస్తూ పెరిగిన దానే్న. తెలుగు సినిమాలో నటించాలన్న ఆశతో ప్రయత్నాలు చేస్తన్న టైంలో ఆదిత్య అవకాశమిచ్చారు. అందరికీ నచ్చే ప్రేమ కథ. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసే కథనం.. వెరసి సినిమా బావుంటుంది అన్నారు. మధు స్రవంతి సంగీతం సమకూరుస్తున్న చిత్రంలో వెంకట్ సిద్ధారెడ్డి, చంద్రవౌళి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, జయశ్రీ రాచకొండ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.