మళ్లీ.. అనే్వషణ చేస్తాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేడీస్ టైలర్, సితార, అనే్వషణ లాంటి ఉత్తమ చిత్రాలను రూపొందించిన దర్శకుడు వంశీ. కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం అనే్వషణ. సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ ఎలిమెంట్స్‌తో అప్పట్లో ఆయన రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో ఓ సంచలనం రేపి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు లాండ్‌మార్క్‌లా నిలిచింది. ఆయన అభిమానులు అటువంటి మరో చిత్రాన్ని రూపొందించమని అడుగుతూనే వుంటారు. మర్డర్ మిస్టరీ కథనంతో రూపొందించిన అనే్వషణలో కథానాయిక గోల్ ఒకటుంటే, కథానాయకుడి అనే్వషణ మరోలా వుంటుంది. ఈ రెండింటి నేపథ్యంలో వంశీ తన మార్క్‌తో రూపొందించిన అనే్వషణ మర్చిపోలేని చిత్రంగా మారింది అప్పుడు ప్రేక్షకులకు. ఇపుడు వంశీ తాజాగా మరో మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఒకరకంగా ఈ చిత్రం అనే్వషణకు సీక్వెల్ అని ప్రచారం జరుగుతోంది. నూతన నటీనటులతో రూపొందించనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానున్నదని తెలుస్తోంది. అయితే ఈ సమాచారం ఎప్పటినుంచో సాగుతోందని, ఆయన మరో అనే్వషణ చేయడని టాలీవుడ్ ఫిలింనగర్‌లో వినిపిస్తున్న గుసగుసలు. వంశీ ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చేదాకా ఎవరికీ నమ్మకాలు కూడా లేవు.