త్రిష లేదా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి, కొరటాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం దసరాకు లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం కోసం అన్ని రకాలఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార, శృతిహాసన్, తమన్నా, అనుష్క లాంటి పేర్లు వినిపించాయి. చివరికి త్రిష ఈ చిత్రంలో నటిస్తోందని ఖరారుగా వినిపించిన సమాచారం. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ త్రిష ఈ చిత్రంనుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. తాను చిరంజీవితో ఈ సినిమాలో నటించడంలేదని చెప్పుకొచ్చింది. అయితే చిత్ర దర్శక నిర్మాతలు వచ్చి అవకాశం ఇస్తే మాత్రం తప్పకుండా నటిస్తానంటూ పేర్కొంది. గతంలో సినిమా యూనిట్ త్రిషతో సంప్రదింపులు జరిపినమాట వాస్తవమే. అయితే రెమ్యూనరేషన్ విషయంలో కుదరలేదో, మరి ఇంకే కారణావల్ల వీలుకాలేదో.. మొత్తానికి త్రిష ఈ చిత్రంనుంచి ఔట్ అయింది. త్రిషనే హీరోయిన్ అని అనుకుంటున్న నేపథ్యంలో, ఆమె పక్కకు తప్పుకోవడంతో ఇక కథానాయిక ఎవరు అన్న ప్రశ్న మళ్లీ మొదలైంది. చూద్దాం.. వెండితెరపై కనిపించే కథానాయిక ఎవరో?