మురుగదాస్‌తో లేనట్టే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల అజిత్ నుంచి సినిమా అంటేనే -అంచనాలతో మొదలవుతుంది. వరుస విజయాలతో టాప్ క్రేజ్ ఎంజాయ్ చేస్తున్నాడు విజయ్. కథలోను, పాత్రల ఎంపికలోనూ ప్రత్యేకతను చూపే అజిత్ 60వ చిత్రంగా ‘వలిమై’ రూపొందుతోంది. దర్శకుడు వినోత్ తెరకెక్కిస్తోన్న సినిమా. అజిత్ 61వ సినిమా ఏస్ డైరెక్టర్ మురుగదాస్‌తో ఉంటుదంటూ వచ్చిన కథనాలు అభిమానులకు కొత్త ఊపునిచ్చింది. 2001లో అజిత్ -మురుగదాస్ కాంబోలో దీనా రావడం తెలిసిందే. ఇద్దరూ వాళ్ల వాళ్ల కేరీర్‌లో టాప్ పొజిషన్‌కు చేరుకున్నా -ఇద్దరి కాంబోలో మళ్లీ సినిమా పడలేదు. ఇంతకాలానికి ఇద్దరూ కలిసి సెట్స్‌పైకి వెళ్తున్నారన్న వార్త ఇండస్ట్రీలో గట్టిగానే వినిపించింది. అయితే -తాజాగా అజిత్ 61వ సినిమా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఉండనుందన్న కథనాలు వినిపిస్తున్నాయి. అంటే -మురుగదాస్‌తో అజిత్ సినిమా లేనట్టేనన్న కథనాలు లేకపోలేదు. అజిత్ 61వ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే వరకూ -వీళ్ల కాంబోపై సస్పెన్స్ తప్పదు. ప్రస్తుతం రజనీకాంత్ దర్బార్ ప్రాజెక్టు షూట్‌తో మురుగదాస్ బిజీగా ఉన్నాడు.