డిటెక్టివ్ మహా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుష్క లీడ్‌రోల్‌లో వస్తోన్న క్రాసోవర్ చిత్రం -నిశ్శబ్ధం. సాక్షి అనే దివ్యాంగురాలి పాత్ర పోషిస్తోంది స్వీటీ. ఆమె లుక్‌తో ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తోన్న మాధవన్ లుక్‌ని సైతం చిత్రబృందం బయటకు వదిలి సినిమాపై ఆసక్తిని పెంచింది. తాజాగా మరో అప్‌డేట్‌నిస్తూ... యూనిఫాంలోవున్న అంజలి లుక్‌ని బయటకు వదిలారు. అందం, అభినయంతో హీరోయిన్‌గా తనకంటూ ఇమేజ్ సొంతం చేసుకున్న అంజలి -ఈ సినిమాలో సియాటెల్ క్రైమ్ డిటెక్టివ్ మహా పాత్ర పోషిస్తోంది. కథను మలుపుతిప్పే కీలక పాత్ర అంజలిదన్న టాక్ వినిపిస్తోంది. ఈమధ్యే విడుదల చేసిన ప్రీ టీజర్‌కు సైతం మంచి రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం ఆనందగా ఉంది. దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తోన్న చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన్ ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, ఇంగ్లీష్, హిందీ, మలయాళం భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనుష్క, మాధవన్, అంజలితోపాటు మైఖేల్ మ్యాడ్‌సన్, షాలినిపాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి సంగీతం గోపీసుందర్, సినిమాటోగ్రఫీ షానియల్ డియో సమకూరుస్తున్నారు.