మెరిశాడే..మెరిశాడే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి తెరకెక్కిస్తోన్న చిత్రం -ప్రతిరోజూ పండగే. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ అమెరికాలో పూర్తి చేశారు. డిసెంబర్ 20న ‘పండగ’ను థియేటర్లకు తెస్తోన్న నేపథ్యంలో.. సినిమా ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. తాజాగా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను బయటకు వదిలారు. టైటిల్ జస్ట్ఫికేషన్‌గా వచ్చే పాట విడుదలైన కొద్ది సమయంలోనే భారీగా లైక్స్ రావడంతో -చిత్రంపై ఉన్న ఆసక్తిని అంచనా వేసుకోవచ్చు. ‘మెరిశాడే మెరిశాడే.. పసివాడై మెరిశాడే/ మునిగాడే మునిగాడే సరదాలో మునిగాడే’ అన్న పల్లవితో మొదలైన మెలోడీ సాంగ్ వినసొంపుగా ఉంది. తాతా మనవళ్ల (సాయితేజ్- సత్యరాజ్) అనుబంధంగా సాగే చిత్ర కథను ప్రతిబింబించేలా పాట ఉండటం విశేషం. హీరో సాయితేజ్‌ను కొత్త తరహా పాత్రలో న్యూలుక్‌లో చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు దర్శకుడు మారుతి వెల్లడించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా కుటుంబ బంధాలు, విలువలను సినిమాలో సరికొత్తగా చర్చిస్తున్నామని, అందుకు తగినట్టే ‘ప్రతిరోజూ పండు’ టైటిల్ ఎంపిక చేసుకున్నట్టు మారుతి చెబుతున్నాడు. భారీ అంచనాలతో టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్న సినిమాలో రావు రమేష్ పాత్ర హైలెట్‌గా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.