ఏ1 గేమ్ స్టార్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస ఫ్లాపుల కారణంగా కుర్ర హీరోలతో రేసులో వెనుకపడిన సందీప్‌కిషన్ -నిను వీడని నీడను నేనే సినిమా హిట్టుతో కెరీర్‌ని మళ్లీ ఫామ్‌లోకి తెచ్చాడు. ఒక్క సాలిడ్ హిట్టైనా పడితే రేసులో ఇంకాస్త ముందుకు రావొచ్చని సందీప్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ చిత్రంతో త్వరలో ఆడియన్స్ ముందుకు రానున్న సందీప్‌కిషన్ -తదుపరి ప్రాజెక్టును అప్పుడే లైన్‌లో పెట్టేశాడు. సందీప్ హీరోగా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ అనే కొత్త ప్రాజెక్టు లాంఛనంగా మొదలుపెట్టి రెగ్యులర్ షూట్ కంటిన్యూ చేస్తున్నారు. క్రీడా నేపథ్యంతో వస్తోన్న కథలను ఆడియన్స్ ఆదరిస్తోన్న నేపథ్యంలో -హాకీ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు డెన్నిస్ జీవన్ ఈ కథను తెరకెక్కిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాపై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్‌కిషన్, దయా పనె్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.