టీజర్‌లో నిశ్శబ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయికా ప్రాధాన్యత కలిగిన పాత్ర అనుష్క చేస్తోందంటే -ఆ సినిమాకో ప్రత్యేకత ఉన్నట్టే. తన పాత్రతో కథనే సమర్థంగా నడిపించగల నటి అనుష్క. ఆమె చేసిన ‘్భగమతి’ సైతం ఈ విషయాన్ని రుజువుచేసింది. అనుష్క చేస్తోన్న మరో నాయికా ప్రాధాన్యతా సినిమా -సైలెన్స్. వివిధ భాషల్లో రూపొందుతున్న సినిమా తెలుగులో -నిశ్శబ్దం టైటిల్‌తో విడుదల కానుంది. మూగదైన చిత్రకారిణి పాత్ర పోషిస్తోన్న అనుష్క -్ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై ఆసక్తి పెంచింది. సియాటెల్ డిటెక్టివ్ ఏజెంట్‌గా అంజలి ఫస్ట్‌లుక్‌కీ మంచి రెస్పాన్స్ రావడంతో -సినిమా నుంచి టీజర్‌ను వదిలేందుకు చిత్రబృందం రంగం సిద్ధం చేసింది. మంగళవారం సాయంత్రం అన్ని భాషల్లో ఒకేశారి ‘సైలెన్స్’ టీజర్ విడుదల చేయనున్నట్టు ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఎక్కువశాతం యుఎస్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో మాధవన్, షాలినీపాండే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. క్రైమ్ నేపథ్యంలో అనుష్క చుట్టూ తిరిగే కథగా నిశ్శబ్ధం ఉండొచ్చని అంచనా.