ఉగాదికి వయొలెన్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగాది రుచుల్లో వయొలెన్స్ కూడా చేర్చుకోమంటున్నాడు -టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని. సుధీర్‌బాబుతో కలిసి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని చేస్తున్న తాజా సినిమా -వి. కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని పాత్రల్ని ఇటు నాని, అటు సుధీర్‌బాబు చేస్తుండటంతో ప్రాజెక్టు ఆసక్తికరంగా మారింది. నాని, సుధీర్‌బాబులకు జోడీగా నివేదా థామస్, ఆదితీరావు కనిపించనున్నారు. సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు ఇప్పటికే చిత్రీకరించారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమా -ఉగాదికి థియేటర్లకు రానుంది. మార్చి 25న సినిమాను విడుదల చేయనున్నట్టు తాజాగా చిత్రబృందం ఓ చిత్రమైన పోస్టర్‌తో ప్రకటించింది. పోస్టర్‌పై రెండు గన్స్‌ని చూపిస్తూ ‘ఈ క్షణం నుంచి నా శత్రువులకు నా దయే దిక్కు’ అన్న షెక్స్‌ఫియర్ కొటేషన్ వాడటం ఆసక్తికరంగా ఉంది. దిల్‌రాజు నిర్మిస్తోన్న సినిమాకు అమిత్ త్రివేదీ సంగీతం సమకూరుస్తున్నాడు. కెరీర్‌లో తమ పాత్రలు ప్రత్యేకంగా నిలిచిపోతాయన్న నమ్మకంతో నాని, సుధీర్‌బాబు ఉన్నారు. ఆ నమ్మకం ఎంత నిజమవుతుందో ఉగాదికి చూద్దాం.