సేమ్ స్కేల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీ బడ్జెట్ సినిమాలకు గ్యాప్ ఇస్తానని చెబుతూ వచ్చిన ప్రభాస్ -మరోసారి భారీ ప్రాజెక్టువైపే అడుగులేస్తున్నాడు. బాహుబలితో అలిసిపోయానంటూనే, గ్యాప్‌లేకుండా ‘సాహో’ను స్క్రీన్‌మీదకు తెచ్చిన ప్రభాస్.. ఈసారి ‘్భరీ’గ్యాప్ ఇస్తాననే చెప్పుకొచ్చాడు. అయితే, అనూహ్యంగా సెట్టైన కాంబినేషన్‌లో ‘పెద్ద సినిమా’వైపే ప్రభాస్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. బడ్జెట్‌కు తగిన భారీ ‘కథ’నాన్ని ‘సైరా’గా చూపించి శెభాష్ అనిపించుకున్న సురేందర్ రెడ్డి ఆ ప్రాజెక్టుకు దర్శకుడట. బ్యానర్ రేంజ్‌కి తగిన భారీ ప్రాజెక్టు ఒకటి ఎప్పటికైనా ప్రభాస్‌తో చేపట్టాలన్న ఆలోచనతోవున్న దిల్‌రాజు -ప్రాజెక్టును సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ నుంచి మరో భారీ ప్రాజెక్టు ఖాయమన్న మాట వినిపిస్తోంది. భారీ చిత్రంగా వచ్చిన సాహో ఫలితం తలకిందులైనా -టాలీవుడ్ భారీ సినిమాలకు ఏకైక హీరో ఆప్షన్ ప్రస్తుతానికి ప్రభాసే. ఇక -సుమారు 250 కోట్ల రూపాయల ప్రాజెక్టును ఆ రేంజ్‌లో తెరకెక్కించిన దర్శకుడిగా సైరాతో సురేందర్ రెడ్డికీ పేరొచ్చింది. కమర్షియల్ పాయింట్ మిస్సవకుండానే చారిత్రక నేపధ్యాన్ని స్క్రీన్‌పై చూపించటంలో ఒకవిధంగా సక్సెస్ అనిపించుకున్నాడు. పెద్ద నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు సైతం ‘పాన్ ఇండియా’ మూవీ తన బ్యానర్‌పైనా చేయాలన్న ఆలోచనతో ఉన్నాడు. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో కొత్త ప్రాజెక్టు దాదాపు సెట్టైనట్టేనన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో పూజా హెగ్దెతో రొమాంటిక్ లవ్‌స్టోరీ స్టోరీ చేస్తున్న ప్రభాస్ -కొత్త కాంబినేషన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టడానికే ఎక్కువ చాన్స్ ఉంది. బాహుబలి గ్రాఫ్ సాహోతో దిగిపోవడంతో -ఆ గ్రాఫ్‌ను మళ్లీ అక్కడికే చేర్చాలన్న కసి ప్రభాస్‌లో లేకపోలేదు. ఇప్పటికే సురేందర్ రెడ్డి చెప్పిన కథపై -ప్రభాస్ దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టే అంటున్నారు. సో, సురేందర్‌రెడ్డి- ప్రభాస్ కాంబోలో దిల్‌రాజు నిర్మాతగా ఓ స్టైలిష్ ఎంటర్‌టైనర్ తెరెకెక్కడం ఖాయమన్న మాట. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడొచ్చు.