చిత్తూరు

గ్రామీణ ప్రాంతాలకు రూ.49కే ల్యాండ్‌లైన్ సౌకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 14: జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం నెలకు రూ.49 రుసుముతో ల్యాండ్‌లైన్ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి బీఎస్‌ఎన్‌ఎల్ జీఎం ఎం.ఎస్.ఏ.న్యూటన్ కోరారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ల్యాండ్‌లైన్ సౌకర్యం పొందిన వారు రాత్రి 10.30 నుంచి ఉదయం 6గంటల వరకు, ఆదివారం రోజు మొత్తం ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా మాట్లాడుకోవచ్చని తెలిపారు. రూ.1200 చెల్లిస్తే సంవత్సరం పాటు ల్యాండ్‌లైన్ పొందవచ్చని, ఈ ప్లాన్‌కు పట్టణ ప్రాంత ప్రజలు రూ.1500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడు ల్యాండ్‌లైన్/ఫైబర్ కనెక్షన్ తీసుకునేవారికి ఇన్‌స్టలేషన్ చార్జీలు ఉచితమన్నారు. గో గ్రీన్ పథకం ద్వారా ఈ-బిల్లింగ్ చెల్లిస్తే బిల్లులో రూ.10 డిస్కౌంట్ పొందవచన్నారు. ప్రైవేట్ బ్రాడ్ బ్యాండ్ సంస్థలకు ధీటుగా నెలకు రూ.645 చెల్లిస్తే 40 ఎంబీపీఎస్ వేగంతో 200 జీబీ డేటా, 2 ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత డేటాను పొందవచ్చని చెప్పారు. రూ.1045తో 80 ఎంబీపీఎస్ వేగంతో 400 జీబీడేటాతోపాటు అపరిమిత డేటాతో పాటుగా వాయిస్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లాలో 2జీ సెల్ టవర్స్ 210, 3జీ సెల్ టవర్స్ 132ను నోకియా సీయెమెన్స్ కొత్త పరికరాలతో మరో 6నెలల్లోగా ఆధునీకరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో కొత్తగా 3జీ సెల్ టవర్స్ 70 ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందువల్ల 4జీకి ధీటుగా డేటా స్పీడ్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ నెలాఖరులోగా జిల్లాలో అదనంగా మరో 10 వైఫై హాట్ స్పాట్స్‌ను ప్రారంభిస్తామన్నారు. మరో 6 నెలల్లోపు బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలను ప్రారంభిస్తామని న్యూటన్ స్పష్టం చేశారు. రూ.249కే అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, టెలిఫోన్ సదుపాయం ఉన్న పథకాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఈ పథకం కింద 1జీబీ డేటా ఒక్క రూపాయికే లభిస్తుందన్నారు. జిల్లాలోని ఎయిర్‌సెల్ వినియోగదారులు తమ నెంబర్ మారకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్తగా రూ.429, 485, 666, 999 ప్రీపెయిడ్ సేవలను, రూ.333, రూ. 444 స్పెషల్ టారీఫ్ ఓచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో డీజీఎంలు సుధాకర్, చంద్రశేఖర్, కృష్ణమూర్తి, ఏజీఎంలు సుబ్రమణ్యం రాజు, వెంకోబరావు, ప్రభాకర్ రెడ్డి, డీఈ శ్రీ్ధర్ రెడ్డిలు పాల్గొన్నారు.

ముగిసిన మానసిక వికలాంగుల క్రీడా సంబరాలు
తిరుపతి, మార్చి 14: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ నేతృత్వంలో స్పెషల్ ఒలింపిక్స్ భారత్ ఆధ్వర్యంలో పాస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన మూడు రోజుల రాష్టస్థ్రాయి మానసిక వికలాంగుల క్రీడలు బుధవారంతో ముగిసాయి. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి 18 స్వచ్ఛంద సంస్థలకు చెందిన సుమారు 245 మంది మానసిక దివ్యాంగులైన క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో షాట్‌ఫుట్, బోసి, ఫుట్‌బాల్, బ్యాట్‌మెంటన్, స్విమ్మింగ్, పరుగుపందెం, సహాయంతో నడవడం వంటి పోటీలు నిర్వహించారు. ఇందులో 53 స్వర్ణ, 53 రజత, 53 కాంస్య పతకాలను విజేతలు సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఒలింపిక్స్ ఏరియా డైరెక్టర్ సి.రాజశేఖర్ రెడ్డి, తిరుపతి పాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.బాలకృష్ణమూర్తి తదితరులు పాల్గొని పోటీల్లో పాల్గొన్న వారిని అభినందించారు.