చిత్తూరు

నేటి నుంచి టెన్త్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మార్చి 14: జిల్లాలో గురువారం నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 54,505 మంది విద్యార్థులు హాజరు కానున్న నేపధ్యంలో 264 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు ఈనెల 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షల్లో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకొన్న లేక పరీక్షా కేంద్రాల్లో సదుపాయాలు లేకపోయినా ఫిర్యాదు చేయడానికి చిత్తూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసారు. కంట్రోల్ రూమ్ పరీక్షలు ముగిసే వరకు 24 గంటల పాటు పని చేస్తోందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎక్కడైనా ఎలాంటి సమస్య వచ్చినా కంట్రోల్ రూమ్‌లోని 9989990284, 08572-229008 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వొచ్చని అధికారులు సూచించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు 51,927 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరు కానుండగా, అందులో బాలురు 26,806, బాలికలు 25,121 మంది ఉన్నారు. ప్రైవేట్ విద్యార్థులు 2578 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షల్లో మాస్ కాపీంగ్ నివారణకు 14 ప్లయింగ్ స్క్వాడ్‌లతోపాటు అదనంగా సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు 15 మంది రెవెన్యూ అధికారులను నియమించారు. జిల్లాలో అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా ఏకాంబర్ కుప్పం, సత్యవేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కోన, నిమ్మనపల్లి, సొరకాయల పాళ్యం, నెల్లేపల్లి లను అధికారులు గుర్తించారు. ఇక్కడ సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కేంద్రం వద్ద నిత్యం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు విద్యార్థులకు తాగునీరు,ప్రాథమిక చికిత్సల కోసం ప్రత్యేక వైద్యశిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షల విధుల్లో 264 డిపార్ట్మెంట్ అధికారులు, 264 చీఫ్ సూపరింటెండ్లతోపాటు ఇతర రూట్ అధికారులు, ఇన్విజలేటర్లు పాల్గొననున్నారు. జిల్లాలో పదోతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు. పరీక్షల కేంద్రాల్లో విద్యార్థులకు బల్లలు అందుబాటులో ఉంచామని, విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురవడంతో ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగ స్వామి తెలిపారు. పరీక్షల నిర్వహణపై బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో విద్యాశాఖ ఆర్ జేడి ప్రతాప్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఈ పరీక్షల్లో ఎక్కడా అక్రమాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మాస్ కాపీంగ్‌కు అస్కారం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి
* రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి కల్పించాలి
* కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా
చిత్తూరు, మార్చి 14: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం చిత్తూరు కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు సీపీఎం నేతలు మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపధ్యంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకొంటామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం నేడు మాట మార్చి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. రాష్ట్ర విభనతో రాయలసీమ మరింత వెనుకబడి పోయిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు . హంద్రి నీవా ప్రాజెక్టును ఆరు నెలల్లో పూర్తి చేయాలని, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయించి త్వరగా ఈ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని మన్నవరం వద్ద బిహెచ్‌ఇఎల్ పరిశ్రమను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి ఆవకాశాలు కల్పించాలని, జిల్లాలో నిర్మిస్తున్న జాతీయ విద్యా సంస్థలకు నిధులు కేటాయించి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, జిల్లాలో ఇండ్రస్ట్రియల్ కారిడార్‌ను ఐటి హబ్‌లు కు ప్రత్కేక నిధులు కేటాయించాలని, జిల్లాలో మూత పడిన సహకార చక్కెర ఫ్యాక్టరీలు, సహకార డెయిరీని తెరిపించాలని, కరవును ఎదుర్కొవడానికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. కలెక్టర్ ప్రద్యుమ్నకు వినతి పత్రం అందజేశారు. ఈ ఆందోళనకు సిఐటియు మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు చల్లా వెంకటయ్య, చైతన్య, రంగరాజు, సురేంద్ర. రమేష్, గణపతి , పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.