చిత్తూరు

ధ్వజారోహణంతో కీలపట్ల కోనేటరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 23: టీటీడీకి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మత్సవాలు సోమవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం స్వామివారు శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మే 1వ తేదీ సాయంత్రం జరగనున్న ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం 4గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరగనుంది. గృహస్తులు 300రూపాయలు చెల్లించి కల్యాత్సవంలో పాల్గొనవచ్చును. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందిస్తారు. మే 2వ తేదీ సాయంత్రం 5గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భగా హిందూ ధర్మప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత కార్యక్రమం, హరికథాగానం, కోలాటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసమంగాపురం ఆలయ డిప్యూటీ ఈఓ వెంకటయ్య, ఏకే నరసింహాచార్యులు, కంకణభట్టార్ కృష్ణసాయి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంస్కృత భాషా పటిమకు వ్యాకరణం గుండె వంటిది
* విద్యాపీఠం వీసీ మురళీధరశర్మ వెల్లడి
తిరుపతి, ఏప్రిల్ 23: సంస్కృత భాషా పటిమకు వ్యాకరణం గుండెకాయ వంటిదని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వీసీ ఆచార్య వి.మురళీధర శర్మ వెల్లడించారు. విద్యాపీఠంలో సోమవారం నుంచి ఈనెల 27వ తేదీ వరకు సంస్కృతంలో రాయడం, అనువాదం అనే అంశాలపై ఐదు రోజుల కార్యశాల సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విసి మాట్లాడుతూ అన్ని భారతీయ భాషలన్నింటికి మూలం సంస్కృత భాష అన్నారు. ఈ భాషలో రాయాలన్నా, అనువాధం చేయాలన్నా వ్యాకరణంపై పట్టు ఉండాలని తెలిపారు. అనువాదం చేసేటప్పుడు కూడా సందర్భానుసారం పదాన్ని అర్థం వచ్చేటట్లు చూసుకోవాలని, లేకుంటే విపరీతార్థాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. రాష్టప్రతి అవార్డు గ్రహీత, మధ్యప్రదేశ్ సాత్నాకు చెదిన వేదవాణివితాన ప్రాచ్య పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ సుద్యుమ్నాచార్య ప్రసంగిస్తూ నేడు భాషపై మక్కువ, పట్టు సాధించాలన్న అభిలాష విద్యార్థుల్లో కొరవడుతోందన్నారు. ప్రధానంగా సంస్కృత విద్యార్థులు, భాషాభిమానులు దీనిని గమనించి, భాషా కౌశల్యంపై దృష్టిసారించాలన్నారు. వ్యాకరణంపై దృష్టిసారిస్తే రాయడం, అనువాదం చేయడం సులభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ ఆచార్య కోరాడ సూర్యనారాయణ, అడిషినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ కందాడై కాదంబిని, సభాసంచాలకులు డాక్టర్ యశస్వి, సీనియర్ అధ్యాపకులు ఆచార్య ఎంఎల్‌ఎన్ మూర్తి, ఆచార్య రాణి సదాశివమూర్తి, ఆచార్య సత్యనారాయణాచార్య, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

పాపవినాశనం తీర్థంలో వేడుకగా వనభోజనం
తిరుపతి, ఏప్రిల్ 23: తిరుమలలోని పాపవినాశనం తీర్థం (పాత పాపవినాశనం) లో సోమవారం వనభోజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు విలేఖర్లతో మాట్లాడుతూ 60వేల తీర్థాలు కలిసే ప్రదేశంగా పుష్కరిణికి ప్రాశస్త్యం ఉందని, ఇందులో ఫిబ్రవరి 25నుండి మార్చి 1వ తేదీ వరకు తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహించామని తెలిపారు. శ్రీవారి ఆలయంతో పాటు సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్, నిఘా, భద్రతా అధికారులు, సిబ్బంది తెప్పోత్సవాల విజయవంతానికి కృషి చేసినట్లు తెలిపారు. తెపోత్సవాలు విజయవంతమైనందుకు గాను కిందిస్థాయి సిబ్బందితో వనభోజనం నిర్వహించామన్నారు. ముందుగా పాపవినాశనం తీర్థంలో గల శ్రీ గంగమ్మకు, శ్రీ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత పసుపు, కుంకుమ, ఫలాలను నీటి ప్రవాహంలో కలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్‌ఇ2 రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ (ఎలక్ట్రికల్స్) వేంకటేశ్వర్లు, డీఎఫ్‌ఓ డి.్ఫణికుమార్‌నాయుడు, వాటర్ వర్క్స్ ఇఇ శ్రీనివాసరావు, విజీఓ రవీంద్రారెడ్డి, అన్నదానం ప్రత్యేకాధికారి వేణుగోపాల్, డిప్యూటీ ఈఓలు బాలాజీ, నాగరత్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.