చిత్తూరు

అమ్మవారి సాక్షిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 23: శ్రీవారి ఇష్టసఖి, తిరుచానూరు అమ్మవారి వాహనం మోసే కుమార్ అనే ఉద్యోగి ఆదివారం అర్ధరాత్రి ఫూటుగా మద్యం సేవించి ఆలయం పక్కన వీరంగం సృష్టించాడు. దీంతో భక్తులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ లోపే కుమార్ చేసిన వీరంగం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఈ క్రమంలో కనపడిన జనంపై దాడి చేశాడు. అంతేకాదు అక్కడున్న మోటార్ సైకిళ్లను వస్తాదులా రెండు చేతులతో ఎత్తుకుని తన మీదుగా దొర్లించాడు. అంతటితో ఆగలేదు. అక్కడ ఉన్న కూరగాయల దుకాణంలో ఉన్న కూరగాయలను రోడ్లుపై వెదజల్లాడు. రోడ్లపై వెళుతున్న జనాన్ని వెంటాడాడు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అమ్మవారి భక్తులు, ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. అమ్మవారి ఆలయం చెంత జరుగుతున్న ఈ బీభత్స సమాచారం తెలుసుకున్న ముగ్గురు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఎంతో ఓపిగ్గా సదరు వీరంగం చేసే టీటీడీ ఉద్యోగి కుమార్‌కు నచ్చజెప్పి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటి వరకు జనంపైన, వస్తువులపైన దాడి చేసిన కుమార్ ఒక్కసారిగా పోలీసులపై బూతుల దండకం ఎత్తుకున్నాడు. పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అయితే ఆ లాఠీదెబ్బలు తనకు చీమకుట్టినట్లు కూడా లేదన్నంత దర్జాగా నిటారుగా నిల్చుని పోలీసులను ఎదురించాడు. ఒక్కసారిగా తన పక్కనున్న పోలీస్ కాలర్ పట్టుకుని దాడి చేశాడు. దీంతో మరో ఇద్దరు పోలీసులు, స్థానికులు కుమార్ పిడిగుద్దుల నుండి పోలీసును వెనక్కి లాగారు. అప్పటివరకు సంయమనం పాటించిన పోలీసులు ఇక తమదైన శైలిలో కుమార్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇంతకీ కుమార్ అర్ధరాత్రి వేళ అర్ధనగ్నంగా అమ్మవారి ఆలయం చెంత ఎందుకు రాద్ధాంతం చేశాడన్నది అర్థం కాని పరిస్థితిగా మారింది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన తరువాత కూడా కుమార్ తన నోటికి పని చెబుతూనే ఉన్నట్లు సమాచారం. సోమవారం మద్యం మత్తు దిగగానే ఇక యధావిధిగా కుయ్యో.. మొర్రో అంటూ పోలీసులను వేడుకున్నట్లు సమాచారం.

అసీఫా నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి
తిరుపతి, ఏప్రిల్ 23: అభం శుభం తెలియని చిన్నారి అసీఫాపై అత్యాచారం చేసి, హత్య చేసిన కామాంధులను వెంటనే కఠినంగా శిక్షించాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అసీఫా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ముస్లిం మైనారిటీ సంఘం, చాంబర్ ఆప్ కామర్స్, అభ్యుదయ రచయితల సంఘం, తెలుగు భాషా పరిరక్షణ సమితి నాయకులు సంయుక్తంగా సోమవారం సాయంత్రం కృష్ణాపురం ఠాణా నుండి గాంధీరోడ్డు మీదుగా నాలుగుకాళ్ల మండపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అసీఫాపై జరిగిన అన్యాయానికి కారకులైన దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వారిని బహిరంగంగా శిక్షిస్తే భవిష్యత్తులో మరొకరు ఇటువంటి దారుణాలకు ఒడికట్టే పరిస్థితి ఏర్పడకుండా ఉంటుందన్నారు. ఆడబిడ్డలపై ఇటువంటి దారుణాలకు ఒడి కడితే భవిష్యత్తులో తల్లి, చెల్లి, అక్క, బిడ్డలు లేకుండా పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను రక్షించుకుందాం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మంజునాధ్, కార్యదర్శి మధుసూదన్‌రావు, కెవి చౌదరి, వాసుదేవన్, హేమచంద్రారెడ్డి, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి సాకం నాగరాజ, తెలుగు భాషోద్యమ సమితి నాయకులు శ్రీమన్నారాయణ, శ్రీదేవి, మస్తానమ్మ, మోహన్‌కుమార్‌రాజు, బుసగాని లక్ష్మయ్య, వర్తమాన రచయిత వాకా ప్రసాద్, టెంకాయల దామోదరం, ముస్లిం మైనారిటీ నాయకులు రఫీ హిందూస్థానీ, అక్బర్, ఇస్మాయిల్, నిజ్జాంతుల్లా, మాలిక్, రామ్‌మోహన్, శ్యామ్, శ్రీ్ధర్, నాగరాజనాయుడు, పీసీసీ కార్యదర్శి తమటం వెంకటనరసింహులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వ్యాపారస్థులు తదితరులు ఉన్నారు.