చిత్తూరు

కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నా-అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 23: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ఈ ఆందోళనకు అంగన్‌వాడీ కార్యకర్తలు తరలిరావాలని కలెక్టరేట్ కిటకిటలాడింది. ఈసందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు సంఘం నేతలు మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయబట్టారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ రద్దు చేయాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని, బకాయిలను, అంగన్‌వాడీ కేంద్రాల అద్దెలు, అమృత హస్తం బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తల పనిదినాలు తగ్గించి ఐసీడీఎస్‌కు సంబంధం లేని అదనపు పనులు కూడా అంగన్‌వాడీ కార్యకర్తలతో చేయిస్తున్నారని ఆరోపించారు. మిని అంగన్‌వాడీలకు వెంటనే ఆయాలను నియమించాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీచేయాలని, అంగన్‌వాడీ కార్యకర్తల్లో అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగిన అంగన్‌వాడీ కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు వీరిని అడ్డుకోన్నారు. దీనితో అంగన్‌వాడీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాటలు చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి వాహనాల్లో తరలిస్తుండగా, ఈ వాహనాలను కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని వాహనాలను అడ్డుకున్న వారిని బలవంతంగా తోసివేసి ఆందోళన కారులను పోలీస్ స్టేషన్‌కు తరలించి అనంతరం సొంతపూచికత్తుపై విడుదల చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ నేతలు సుజన, వాణిశ్రీ, సీ ఐటీయు నేతలు గంగరాజు, చైతన్య, వెంకటయ్య, పలువురు నేతలు, అధిక సంఖ్యలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొనారు.

పుట్టా సుధాకర్ యాదవ్ కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి
* హిందూ చైతన్య సమితి అధ్యక్షుడు తుమ్మా ఓంకార్ డిమాండ్
తిరుపతి, ఏప్రిల్ 23: టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా నియమితులై అన్యమతస్తురాలిగా విమర్శలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే అనిత తరహాలోనే టీటీడీ చైర్మన్‌గా నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్ కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, లేకుంటే ప్రభుత్వమే ఆయన్ను తొలగించాలని హిందూ చైతన్య సమితి అధ్యక్షుడు తుమ్మా ఓంకార్ డిమాండ్ చేశారు. టీటీడీ పాలక మండలి చైర్మన్‌గా నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 హిందూ సంస్థల ప్రతినిధులు తిరుపతిలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన తెలిపి, అక్కడ నుంచి అలిపిరి వరకు పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా తుమ్మా ఓంకార్ మాట్లాడుతూ 90శాతం మంది హిందువులు వ్యతిరేకిస్తున్న కారణంగా ఆయన తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీని రాజకీయ నాయకుల పునరావాస కేంద్రంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ధార్మిక చింతన, ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారిని, నిస్వార్థపరులను టీటీడీ చైర్మన్‌గా నియమించాల్సి ఉందన్నారు. ఇలాంటి వారివల్లే టీటీడీ ప్రతిష్ట పెరుగుతుందని, భక్తుల సమస్యలు పరిష్కారం అవుతాయని, టీటీడీకి ఆదాయం పెరుగుతుందే తప్ప తగ్గదని చెప్పారు. రాజకీయనాయకులను, తమ స్వార్థం కోసం పాకులాడే వారిని టీటీడీ చైర్మన్‌గా నియమిస్తే తిరుమలను వ్యాపార సంస్థగా మార్చేస్తారన్నారు. ఈ పరిస్థిత్లుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన పాలకమండలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయని, ఈ పాలకమండలిని రద్దు చేయాలన్నారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ పుణ్యక్షేత్రాలను వ్యాపార కేంద్రాలుగా, రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిస్తే హిందువులు చూస్తూ ఊరుకోరని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ప్రభుత్వం సుధాకర్ యాదవ్‌ను తొలగించకుంటే తిరుపతిలో 10వేల మందితో హిందూ గర్జన కార్యక్రమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. సుదర్శన్ మహాసేన అధ్యక్షులు సత్యనారాయణ వల్లిపి, భజరంగ్‌దళ్ అధ్యక్షులు రాంవళ్లి మాట్లాడుతూ టీటీడీ చైర్మన్‌గా నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్ 2016, నవంబర్ 15న కడప జిల్లాలో ఏసు స్వస్థత తిరునాళ్ల మహోత్సంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసినట్లు ఆధారాలున్నాయన్నారు. ఇలాంటి వ్యక్తిని హిందూ ధార్మిక సంస్థ అయిన టీటీడీకి చైర్మన్‌గా నియమించడంలో సీఎం అసలు ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయాలన్నారు. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఉన్నప్పుడే వివిధ అన్యమత కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఆధారాలు చూపినా సీఎం ఆయనే్న చైర్మన్‌గా చేయడం వెనుక ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధి రాధామనోహర్ దాస్, వీహెచ్‌పీ నాయకులు రాజిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.