చిత్తూరు

ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 23: జిల్లాలో వచ్చేనెల జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సజావుగా జరగడానికి రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీల నేతలతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్డు జారీ చేసిందని తెలిపారు. ఈనేపథ్యంలో వచ్చేనెల 21వ తేదిన ఈ ఎన్నిలకు పోలింగ్ కొనసాగుతుందని, అలాగే వచ్చే నెల 29వ తేదీ వరకు ఎన్నికల కోడ్ జిల్లాలో అమలవుతుందన్నారు. రాజకీయ పార్టీలు విధిగా ఎన్నికల నియమావళి పాటించాలని సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఎన్నికలకు ఈనెల 26వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ గిరిషా కొనసాగుతారని తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ఏ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం నిషేదమని, అలాగే ఎక్కడైనా బహిరంగ సభలు నిర్వహించాలన్న ముందస్తుగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాల్టీ పట్టణాల్లో కమిషనర్లు ఎన్నికల నియమావళిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మొత్తం ఈ ఎన్నికల్లో 1163మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉందన్నారు. నామినేషన్ల ప్రక్రియ 26 నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు కొనసాగుతుందని, 4వ తేదీన నామినేషన్ల పరిశీలన, 7న నామినేషన్ల ఉపసంహరణతో పాటు అదే రోజు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితాను వెల్లడిస్తారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ నగరి మున్సిపాల్టీలో టీడీపి చెందిన కౌన్సిలర్ వైకాపాలో చేరారని, అయితే రెండు సంవత్సరాలుగా కౌన్సిల్ సమావేశానికి వచ్చిన దాఖలాలు లేవని దీనితో అతనిని ఓటింగ్‌కు అనర్హుడుగా ప్రకటించాలని ప్రస్తావించారు. దీనితో నగరి మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకొని ఈ వ్యవహారంపై కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు. దీనితోకలెక్టర్ జోక్యం చేసుకొని దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిషనర్‌ను ఆదేశించారు. అలాగే మున్సిపల్ పట్టణాల్లో విచ్చల విడిగా వెలుస్తున్న ప్లెక్సీలను వెంటనే తొలగించాలని కలెక్టర్ కమిషనర్లకు ఆదేశించారు. జిల్లాలో ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి రాజకీయ పార్టీలు అధికారులకు సహకరించాలని ఎలాంటి సందేహాలు ఉన్నా ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో తాగునీటి సరఫరా, వైద్య సేవల పరంగా ఎలాంటి అటంకాలు ఉండవన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌వో గంగాధరగౌడు, జెసి-2 చంద్రవౌళి, పలువురు మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.
టీటీడీలో పాలనపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు:-
జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో టీటీడీ నూతన పాలక మండలి ఎలాంటి పాలన పరమైన నిర్ణయాలు తీసుకోకూడదని కలెక్టర్ తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి కొత్త పాలక మండలిని నియమించిందని అయితే ఎన్నికల షెడ్యూల్ ముందే ఈ పాలక మండలిని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పాలక మండలి సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించవచ్చని, అయితే బోర్డులో ఎలాంటి తీర్మాణాలు చేయడానికి వీలు లేదని కలెక్టర్ హెచ్చరించారు.

అజాగ్రత వల్లనే రోడ్డు ప్రమాదాలు
* వేగం కన్నా ప్రాణం మిన్న
* జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న
చిత్తూరు, ఏప్రిల్ 23:అజాగ్రత వల్లనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. సోమవారం సాయంత్రం చిత్తూరు ఆంబేద్కర్ భవన్‌లో రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు ఎక్కువగా జిల్లాలో ద్విచక్రవాహన దారులే రోడ్డు ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నారని తెలిపారు. ద్విచక్రవాహన దారులు విధిగా హెల్మట్ ధరించాల్సి ఉన్నా ఎక్కువ మంది దాన్ని పాటించడం లేదన్నారు. దీని వల్లనే ప్రమాదాలు జరిగిన వెంటనే పలువురు గాయబడి మరణించండం జరుగుతుందన్నారు. వేగం కన్నా ప్రాణం మిన్న అన్న విషయాన్ని గుర్తించాల్సి ఉందన్నారు. వాహనాదారులు విధిగా రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా ద్విచక్రవాహన దారులే వల్లనే రోడ్డు ప్రమాదాలు చోటు చేసు కొంటున్నాయని, జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో 70 శాతం ద్విచక్రవాహనాల వల్లనే చోటు చేసుకొంటున్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే నేడు ఈ ప్రమాదాలు కొంత వరకు తగ్గాయని, అయితే ప్రజల్లో కూడా చైతన్య రావాల్సి ఉందన్నారు. వాహనదారులు విధిగా రోడ్డు నిబంధనలు పాటిస్తే ఎటు వంటి ప్రమాదాలు చోటు చేసుకొనే అవకాశం లేదన్నారు. ఈ కార్యక్రంమలో డిటిసి ప్రతాప్ ఇతర రవాణా, పోలీసు అధికారులు విద్యార్థులు , నగర ప్రముఖులు పాల్గొన్నారు.