చిత్తూరు

టెర్రకోటపై తెలంగాణ గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లి, ఏప్రిల్ 19: జిల్లాలో టెర్రకోట కుండలు, బొమ్మలకు పేరొందిన అంగళ్లు కంటేవారిపల్లిలోని టెర్రకోట స్టాల్స్‌ను తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు జూలూరి గౌరీశంకర్ గురువారం సాయంత్రం పరిశీలించారు. మట్టితో తయారయ్యే వాటిని చూసి ముగ్ధులయ్యారు. వీటి తయారీలో కష్టనష్టాలు, ఆదాయ వివరాలు, ఇబ్బందులు, మార్కెటింగ్ సౌకర్యం తదితర వాటి గురించి హస్తకళాకారులను అడిగి తెలుసుకున్నారు. ఈ వృత్తిపై ఆధారపడిన కుటుంబాలు, వారి జీవన స్థితిగతులు తెలుసుకున్నారు. టెక్నాలజీ వాడకంపై అడిగి తెలుసుకున్నారు. హస్త కళాకారులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహాయ సహకారాలపై కూడా ఆరా తీశారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ టెర్రకోట బొమ్మలకు తరగని ఆదరణ ఉందన్నారు. హైదరాబాదు తదితర ప్రాంతాల్లోని ఎగ్జిబిషన్‌లలో ఇక్కడి కుండలు, బొమ్మలకు తరగని డిమాండ్ లభిస్తోందన్నారు. తెలంగాణలో కూడా తయారు చేయడానికి గల అవకాశాలను పరిశీలించడానికి వచ్చామన్నారు. హస్తకళాకారులకు జీవనోపాధికి ఆస్కారం ఉంటుందన్నారు. మట్టితో అందమైన బొమ్మలు, కుండలు తయారు కావడం హస్తకళాకారుల నైపుణ్యాన్ని ప్రశంసించారు. కొత్త టెక్నాలజీని వాడితే కళాకారులకు శ్రమ తగ్గడంతో పాటు ఆదాయం లభిస్తుందన్నారు. ఏది ఏమైనా ఇక్కడి టెర్రకోట హస్తకళపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనే్నసిందన్న అనుమానాలను కలిగిస్తోంది. ఆ రాష్ట్ర హస్తకళాకారులకు ఉపాధి అవకాశాలకు ఆస్కారం ఉంటుందని, తద్వారా ప్రభుత్వానికి ఆదరణ లభించగలదని భావిస్తున్నారు.

మన ఆరోగ్యం - మన చేతుల్లో
* మెప్మా పీడీ జ్యోతి వెల్లడి
తిరుపతి, ఏప్రిల్ 19: మన ఆరోగ్యం మన చేతుల్లో అనే నినాదంతో మెప్మా ఆధ్వర్యంలో 300 మంది వైద్య విద్యార్థులకు మూడు రోజులపాటు నిర్వహించిన మహిళల ఆరోగ్యంపై అవగాహన సదస్సు గురువారం ముగిసింది. స్థానిక తనపల్లి వద్ద ఉన్న ఐఎంఏ కార్యాలయంలో జరిగిన ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పీడీ జ్యోతి మాట్లాడుతూ ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్శిటీ, పిన్నమనేని వైద్య కళాశాల, మెప్మా సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నాటికి పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ మహిళా సంఘాలకు ఆరోగ్యంపై పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వైద్య విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. గన్నవరం పిన్నమనేని వైద్య కళాశాల తరపున 10వేల మంది పట్టణ పేద మహిళల ఆరోగ్య విషయాలను సర్వే చేసి అధికంగా రుతుస్రావం, పరిశుభ్రత లేకపోవడం, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ వంటి అంశాలపై ముందస్తు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అవగాహనలేక ఆరోగ్య రీత్య వైద్య ఖర్చులు అధికమై పేదలు చితికిపోతున్నట్లు సర్వేలో తేలిందన్నారు. అందుకే జూన్ 2 నాటికి రాష్ట్రంలోని 20లక్షల మంది మెప్మా సభ్యులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. మెప్మా న్యూట్రీషియన్ అహల్య మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ కరుణమూర్తి కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. పిన్నమనేని వైద్య కళాశాలలో మాస్టర్ ట్రైనర్స్‌గా 36 మంది డాక్టర్లు శిక్షణ పొందుతున్నారన్నారు. తిరుపతి, గన్నవరం, విశాఖ పట్నంలో 300 సీనియర్ వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం గురువారంతో ముగిసిందన్నారు. మొదటి దశలో మే 5 నాటికి చదువుకున్న మహిళా సంఘ సభ్యుల్లో లక్ష మందికి వీరు మొదటి దశ శిక్షణ ఇస్తారని, వీరు జూన్ 2 నాటికి మిగిలిన మెప్మా సభ్యులు 19 లక్షల మందికి అవగాహన కల్పిస్తారన్నారు. ఈకార్యక్రమంలో శిక్షణ పొందుతున్న వైద్య విద్యార్థులు, ట్రైనర్లు పాల్గొన్నారు.

ముస్లిం వేషధారణలో చిత్తూరు ఎంపి
చిత్తూరు, ఏప్రిల్ 19: జిల్లా తెలుదేశం పార్టీ కార్యాలయంలో గురు వారం జరిగిన టీడీపీ మైనారిటీ సదస్సుకు చిత్తూరు ఎంపి శివప్రసాద్ ముస్లిం వేషధారణలో వచ్చి సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇటీవల రాష్ట్రానికి ప్రత్కేక హోదా కోసం పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోజుకొక వేషధారణలో వినూత్నంగా ఎంపీ నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. గురువారం చిత్తూరులో జరిగిన టీడీపీ మైనారిటీ సదస్సుకు ముస్లిం వేషంలో వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టందని వివరించి , గతంలో బీజేపీ పొత్తు వల్ల తెలుగు దేశం పార్టీ కొంత మైనారిటీల వల్ల నష్ట పోయిందని, రానున్న ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీకి తగిన గుణ పాఠం చెప్పాలను తెలిపారు. ప్రధానంగా మైనారిటీలను ఆకర్షించే విధంగా ఆయన ప్రసంగం కొనసాగింది.