అక్షర

‘చాటుమాటు’ సమస్యలపై చక్కటి విజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛుప్ కె ఛుప్ కె...
-డా.లంకా శివరామప్రసాద్
డా.పి.జానకిదేవి
ప్రతులకు:
అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

స్ర్తి, పురుషుల్లో ప్రకృతి పరంగానే చాలా నే తేడాలుంటాయి. శరీర నిర్మాణం మొదలుకొని ఆయా సందర్భాల్లో ఆలోచనలు, భావోద్వేగాల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ విషయాన్ని అవగాహన చేసుకున్నవారు శారీరకంగా, మానసికంగా తమకు ఎదురయ్యే సమస్యల నుంచి తేలికగా, త్వరగా బయటపడ గలుగుతారు. ఆ ఆలోచన కొరవడినవారు సమస్యను భూతద్దంలో చూస్తూ అదనపు చిక్కులు కొని తెచ్చుకుంటారు. ప్రకృతి సహజంగా స్ర్తిలలో ఎదురయ్యే సమస్యలను చర్చించి చక్కని పరిష్కార మార్గాలు సూచించిన పుస్తకం ‘్ఛప్‌కే ఛుప్‌కే’! స్ర్తిలలో వచ్చే సమస్యలను చక్కని కథల రూపంలో చర్చించారు రచయితలు. పఠితలకు కథలు చదువుతున్న అనుభూతి కల్పిస్తూ చక్కని పరిష్కార మార్గాలు చూపించారు.
యుక్త వయసు వచ్చాక శారీరకంగా, మానసికంగా ఆడపిల్లల ఎదుగుదల, రజస్వల అయినప్పటి నుంచీ వారికి ఎదురయ్యే ఇబ్బందులు, అనారోగ్యాలు, సమాజం పెట్టే ఆంక్షలు, ఈ అత్యాధునిక సైబర్ యుగంలోనూ నేటికీ కొనసాగుతున్న మూఢనమ్మకాలు, చోటుచేసుకుంటున్న మార్పుల గురించి సోదాహరణంగా వివరించారు రచయితలు. రజస్వల కావటం, స్తనాల ఎదుగుదల, రుతుచక్రం సరిగా రావటం, క్యాన్సర్ వ్యాధులు, పూర్వకాలంలో చేసిన వైద్యం, ఇప్పటి వైద్యంలో వచ్చిన మార్పులు, సౌకర్యాల గురించి తెలియజెప్పారు. స్ర్తిలను ‘వుమన్’గా సంబోధించటం ఎలా జరిగిందీ, చంద్ర, శుక్ర, కుజ గ్రహాల ప్రభావం మానవ జీవితం మీద ఏ మేరకు వుంటుంది, కన్యత్వానికి ఇచ్చిన ప్రాధాన్యం గురించి బాగా చెప్పారు. గర్భిణీకి వచ్చే సమస్యలు, ముత్యాల గర్భిణీ, పిండం ఏర్పడటం, పెరుగుదలలో వచ్చే ఇబ్బందులు, నివారణ, కవల పిల్లలు, రకాలు, వ్యంధత్వం, పురుషుల్లో వరికోసీల్, స్ర్తిలలో అండం, గర్భం, పిండగర్భం, సోషియల్ ఎగ్ ఫ్రీజింగ్, దీని ఉపయోగాలు తెలియజెప్పారు. గర్భసంచి మార్చడం గురించి తెలియనివారికి ఎంతో ఉపయోగకరమైన సమాచారం ఇచ్చారు. డిఎన్‌ఏ టెస్ట్, బిడ్డ ఆడ, మగ, తండ్రి ఎవరనేది వైద్యపరీక్షల్లో ఎలా తెలుస్తుందో వివరించారు. 40-61 సంవత్సరాల వయస్సు మధ్య సంభవించే మోనోపాజ్ ఎక్కువ మందికి 51 ఏళ్లకే వస్తుంది. యూరినరీ ఇన్‌కంటినెన్స్ వల్ల పిల్లల్లో, పెద్దల్లో చెప్పుకోలేక పడే ఇబ్బందులు, దానికి వున్న వైద్య సదుపాయాలు, వ్యాయామం, సర్జరీల సమాచారాన్ని అర్థవంతంగా వివరించారు. గర్భ నిర్ధారణను 48గంటల్లో ఇపిఎఫ్ టెస్ట్ తెలియచేస్తే యూరిన్ టెస్ట్ 6-12 రోజుల్లో, అల్ట్రాసౌండ్ 5 వారాలకు తెలియచేస్తుంది. 6వ వారం పిండం హృదయ స్పందనలు కూడా తెలుసుకోవచ్చు. గుర్రపువాతం అనే వ్యాధి ట్రోఫోబ్లాస్ట్ కణాలు విఫలం కావడం వల్ల వస్తుంది. మార్నింగ్ సిక్‌నెస్, అధిక రక్తపోటు, స్ర్తిలు బాధలుపడే సమయంలో ఇంట్లో వాళ్లు ఎలా సానుభూతితో సహకరించాలో, వైద్యం సక్రమంగా అందేలా చూడటం, ఇతర వివరాలు పొందుపర్చారు. చరిత్రలో పరిశోధనలు, మూఢ నమ్మకాలు, స్ర్తిల మనోక్షోభ, ఆధునిక వైద్య విధానంలో వచ్చిన మార్పులు సవివరంగా చెప్పారు. పుస్తకానికి ‘చాటుమాటుగా’ అనే విస్తృతార్థంలో ‘్ఛప్‌కె ఛుప్‌కె’ అనే టైటిల్ పెట్టారు. హిందీ తెలియని వాళ్లు అర్థం చేసుకోకపోగా, ఈ పుస్తక విజ్ఞానాన్ని కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదు. రహస్య భాష అనేది ప్రతి భాగానికి ఇవ్వనక్కరలేదు. ఎంతో పరిశోధించి ఈ పుస్తకం రాసిన డా. లంక శివరామ ప్రసాద్ గారు, జానకి దేవిగారు అభినందనీయులు. అందరూ తప్పక చదవవలసిన పుస్తకం ఇది.

-సిరిపురపు అన్నపూర్ణ