జాతీయ వార్తలు

వివరాలు ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌పాల్ నియమకాలపై సిఐసి

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: లోక్‌పాల్‌కు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు వెల్లడించాలని కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) ప్రభుత్వాన్ని ఆదేశించింది. లోక్‌పాల్‌కు ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారు, వారి గత చరిత్ర ఏమిటి అన్న వివరాలు ప్రజలకు తెలియాల్సి ఉన్నందున పేర్లు బహిర్గతం చేయాలసి కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్‌పాల్ ఎంపిక కమిటీని సిఐసి ఆదేశించింది. ఉన్నత స్థానాల్లో నియామకాలకు సంబంధించి పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలంటే అభ్యర్థుల గుణగణాలు ప్రజలకు తెలియాల్సి ఉందని హక్కుల కార్యకర్త సుభాష్ అగర్వాల్ స్పష్టం చేశారు. వారి వివరాలు వెల్లడించాలని ఆయన సిఐసిని ఆశ్రయించారు. అయితే అభ్యర్థుల పేర్లు, వివరాలు అందించడానికి కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ నిరాకరించింది.
అవినీతిని అరికట్టడానికి ఏర్పాటైన లోక్‌పాల్‌కు సంబంధించి వివరాలు వెల్లడించడం సాధ్యంకాదని చెప్పింది. ఈ విషయాన్ని ఆయన సిఐసి దృష్టికి తీసుకెళ్లగా కమిషన్ స్పందించింది. లోక్‌పాల్ చైర్‌పర్సన్, సభ్యుల పదవులకోసం దరఖాస్తు చేసుకున్నవారి వివరాలు వెల్లడించాల్సిందేనని సిఐసి కమిషనర్ సుధీర్ భార్గవ ఆదేశించారు. ఎంపిక మొత్తం ప్రక్రియ ప్రజలకు తెలియాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు.