జాతీయ వార్తలు

సినిమాహాళ్లు, రెస్టారెంట్లు ఇక రోజంతా ఓపెన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: సినిమా థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, స్టోర్లు ఇక 24 గంటలూ వ్యాపారం చేసుకోవచ్చు. ఇక్కడ బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంటు చట్టానికి సవరణ చేస్తారు. ప్రస్తుతం దేశంలో సేవారంగ సంస్థలు, భారీ ఉత్పత్తి సంస్థలకు మాత్రమే ఈ అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వినోదం, పర్యాటకం, హోటల్ పరిశ్రమల్లో వ్యాపారం మరింతగా పుంజుకునే అవకాశం ఉంది.