అంతర్జాతీయం

చెన్నైలో భారీ వర్షాలకు వాతావరణ మార్పులే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిటీ ప్లానర్లు ఇకనైనా కళ్లు తెరవాలి
లేదంటే తీవ్రమైన విపత్తులు తప్పవు
పర్యావరణ నిపుణుల హెచ్చరిక

వాషింగ్టన్, డిసెంబర్ 5: దక్షిణ భారత దేశంలో అతిపెద్ద నగరమైన చెన్నైతోపాటు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు వాతావరణంలో వచ్చిన మార్పులే ప్రధాన కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి విపత్తులతోనైనా సిటీ ప్లానర్లు కళ్లు తెరవాలని, లేదంటే మున్ముందు మరింత తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. భారత్‌లోని అతిపెద్ద ఔట్‌సోర్సింగ్ కేంద్రాల్లో ఒకటిగానూ, విదేశీ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగానూ ఉన్న చెన్నైలో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతాయని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘17 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భూతాపం, వాతావరణ మార్పులతో అల్లాడుతున్న ప్రపంచంలో ఇకముందు ఇటువంటి విపత్కర పరిస్థితులు సర్వసాధారణంగా సంభవించడం ఖాయం’ అని డబ్ల్యుఆర్‌ఐ (వరల్డ్ రిసోర్సెస్ సెంటర్)లో ఇండియా అడాప్షన్ స్ట్రాటజీ విభాగం అధిపతిగా పనిచేస్తున్న నంబి అప్పార్దురై స్పష్టం చేశారు. ఈ విభాగంలో ఆయనకు పదేళ్ల అనుభవం ఉంది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న తీవ్రమైన మార్పులను మనం సరిగా ఆకళింపు చేసుకోలేకపోతున్నాం. అందువల్లనే ఇటువంటి విపత్తులు సంభవించి సవాళ్లు పునరావృతమవుతున్నాయి. ప్రస్తుతం చెన్నైలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇటువంటి ఆకస్మిక, భారీ వర్షాలు సంభవించడాన్ని మనం ఎన్నో ఏళ్లనుంచి చూస్తూనే ఉన్నాం. అలాగే ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితులకు ‘ఎల్‌నినో’ కూడా కొంతమేర కారణమన్న వాస్తవాన్ని ఎవరూ తోసిపుచ్చలేరు అని ఆయన స్పష్టం చేశారు.