తూర్పుగోదావరి

సివిల్ కాంట్రాక్టర్లుగా డ్వాక్రా మహిళలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*డ్వాక్రా సంఘాలకు సిసి రోడ్ల నిర్మాణ బాధ్యతలు *కాంట్రాక్టు పనులపై శిక్షణకు ఏర్పాట్లు
కాకినాడ, డిసెంబర్ 18: ఇప్పటికే మహిళా సంఘాలకు ఇసుక ర్యాంపుల నిర్వహణ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం తాజాగా సిసి రహదారుల నిర్మాణ పనులను కూడా అప్పగించాలని నిర్ణయించింది. ఈ చర్య ద్వారా మహిళలను సివిల్ కాంట్రాక్టర్లుగా మార్చే బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంది. రాష్టవ్య్రాప్తంగా జిల్లాల వారీ సిసి రోడ్ల నిర్మాణ బాధ్యతలు డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆయా గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణ పనులకు స్వయం సహాయక సంఘాలను ఎంపిక చేసేపనిలో అధికార్లు నిమగ్నమయ్యారు. సిసి రోడ్లు, డ్రెయిన్లు నిర్మించడానికి అవసరమైన యంత్రాలు, ఇతర పరికరాలను ఆయా సంఘాలు సమకూర్చుకునేలా చూడాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రహదారుల నిర్మాణంపై డ్వాక్రా లీడర్లకు తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి పంచాయితీరాజ్ శాఖ ఇంజనీర్లు రంగం సిద్ధం చేశారు. డ్వాక్రా మహిళలు, తాపీ మేస్ర్తిలు, సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా చేపడుతున్న ఈ రహదారుల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సరఫరా చేయడానికి చర్యలు చేపట్టారు. గ్రామాలలో నిర్మిస్తోన్న రహదారులు, డ్రెయిన్లను గతంలో మాదిరిగా కాకుండా పక్కా ప్రణాళికతో నిర్వహించడానికి డిజైన్లు రూపొందించారు. రోజుకు 3కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించేలా చర్యలు చేపట్టారు. 2016 మార్చి నెలాఖరుకు ఈ నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసేందుకు లక్ష్యాన్ని నిర్దేశించారు. సిసి రోడ్లకు ఇరువైపులా టైల్స్ ఏర్పాటుచేయనున్నారు. రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
బినామీలు రంగంలోకి...
ఇదిలావుండగా డ్వాక్రా సంఘాలకు సిసి రోడ్ల నిర్మాణ బాధ్యతలను అప్పగించేందుకు ప్రభుత్వం ముందుకువచ్చిన నేపథ్యంలో బినామీలు రంగంలోకి దిగే అవకాశముందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇసుక ర్యాంపులను డ్వాక్రా సంఘాల మాటున బినామీలు రాజ్యమేలుతున్న సంగతి విదితమే. ఇదే తరహాలో రోడ్ల పనులు కూడా కాంట్రాక్టర్లు దొడ్డిదారిలో పనులు హస్తగతం చేసుకునే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే పర్సంటేజీల పంపకంలో మరో వాటా పెరిగి, రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపించడంతో పాటు పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. సమర్ధవంతమైన మహిళా సంఘాలను మాత్రమే రహదారుల నిర్మాణానికి ఎంపిక చేసి, పనులు అప్పగించేలా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.