జాతీయ వార్తలు

అదనపు అవకాశం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2012-14 సివిల్ సర్వీస్ అభ్యర్థులకు కేంద్రం స్పష్టీకరణ

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: గత మూడేళ్లలో సివిల్ సర్వీసు పరీక్ష రాసిన యుపిఎస్‌ఇ అభ్యర్థులకు ఈ ఏడాది అదనంగా మరో అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్ష పాట్రన్ మారిన దృష్ట్యా 2011 సివిల్ సర్వీసు పరీక్ష రాయడానికి అర్హులైన, లేదా 2012నుంచి 14 దాకా పరీక్ష రాసిన అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలో లేదో పరిశీలించాలని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డిఓపిటి)ని ఆదేశించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ‘అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఈ అభ్యర్థులకు సివిల్ సర్వీసు పరీక్ష రాయడానికి అదనంగా మరో అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని నిర్ణయించడమైంది’ అని డిఓపిటి విడుదల చేసిన ఒక ఉత్తర్వు పేర్కొంది. 2011 అభ్యర్థులకు ఈ ఏడాది అదనంగా మరో అవకాశం ఇస్తామని ప్రభుత్వం గత ఆగస్టులో పార్లమెంటులో హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగా డిఓపిటి ఒక ఉత్తర్వు కూడా జారీ చేసింది. అయితే దీనిపై క్యాట్‌లో ఒక ఫిర్యాదు దాఖలు కావడంతో, ఈ అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందో లేదోనాలుగు వారాల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.