జాతీయ వార్తలు

సుప్రీం సిజె కంట కన్నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:దేశంలో అవసరాలకు తగ్గట్లు న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని, కేసుల పరిష్కారంలో బరువంతా న్యాయవ్యవస్థపై పడేయడం బాగోలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌ఠాకూర్ అన్నారు. రాజధానిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, ప్రధాని పాల్గొన్న న్యాయసదస్సులో మాట్లాడిన ఠాకూర్ ఓ దశలో తీవ్ర భావోద్వేగానికి గురైనారు. గద్గదస్వరంతో కొద్దిసేపు ప్రసంగించిన ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. న్యాయవ్యవస్థకోసం న్యాయమూర్తుల సంఖ్య పెంచాల్సిన అవసరం లేదని, కానీ దేశ అభివృద్ధి దృష్ట్యా ఇది అవసరమని, ఈ విషయంలో కేంద్రం చొరవచూపాలని ఆయన కోరారు. 1987లో లా కమిషన్ చేసిన సిఫార్సులకు అతీగతీలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం దేశంలో ఇప్పుడు 40వేలమంది న్యాయమూర్తుల అవసరం ఉందని, కానీ 21వేలమంది మాత్రమే ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో ప్రధాని మోదీ కల్పించుకుని న్యాయవ్యవస్థ పటిష్టానికి కేంద్రప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు.