'క్లాప్' కొట్టు గురూ!

కొత్త ప్రయాణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో అగ్రహీరోలతో ఆడిపాడిన అందాల భామ కాజల్ అగర్వాల్ బాలీవుడ్‌పై మోజు పెంచుకొని మళ్లీ వెనక్కే చూసింది. కొత్త ఉత్సాహంతో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఖైదీ నెం.150’ చిందులేసినా ఆ చిత్రం ఆశించిన అవకాశాలను మాత్రం కల్పించలేకపోయింది. ఇక లాభం లేదనుకున్న ఈ అమ్మడు కొత్త ప్రయాణాన్ని సాగించడానికి సిద్ధమయింది. అదే ఆచి తూచి అడుగులు వేయడం. చిన్న పాత్రలైనా నటిగా గుర్తింపు తెచ్చేపెట్టేవి మాత్రమే చేయాలనుకుంటోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’లో జోడీ కట్టింది. ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రలపై దృష్టి సారించి వృత్తిపరంగా అనుకున్న రేంజ్‌కి ఎదిగింది. కెరీర్ సాఫీగా సాగుతున్న తరుణంలో కొత్త భామల రాకతో కాస్త వెనకంజ వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎలా వుంది కెరీర్ అని కాజల్‌ని కదిలిస్తే- ‘‘సాఫీగా సాగుతోంది. అయితే అనుకున్నంత కాకపోయినా కాస్త నెమ్మదిగానే అడుగులు వేస్తున్నా. తెలుగు, తమిళ భాషల్లో మంచి పాత్రలే చేశాను. చేస్తున్నాను.
నేను చేసిన చిత్రాలన్నీ నా కెరీర్‌కి ఎంతగానో దోహదం చేశాయి. నేను ఇతరుల గురించి ఆలోచించను. నా చిత్రాలు.. నా పాత్రలు ఇవే నాకు కావల్సింది. ఎవరో వచ్చారని.. అందుకే కెరీర్‌లో వెనకడుగు వేశానని అనడం సరైంది కాదు. నా కెరీర్ నాదే’’అంటూ ఎంతో తెలివిగా చెప్పుకొచ్చింది.