'క్లాప్' కొట్టు గురూ!

వామ్మో..బబ్లీబ్యూటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటున్నారంతా అందాలతార హన్సికను చూసి. అలా అనుకునే వాళ్లు ఏ అభిమానో.. ఏ ప్రేక్షకుడో అనుకుంటే పొరపాటే మరి! వీళ్లెవరూ కాకుండా మరెవరనుకుంటున్నారు కదూ.. అదే అక్కడికే వద్దాం... వాళ్లే కోలీవుడ్‌లో ఈ అమ్మడితో చిత్రాలు రూపొందిస్తున్న నిర్మాతలట. అవును.. నిజంగా నిజం! ‘దేశముదురు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హన్సిక టాలీవుడ్‌లో నిలదొక్కుకోలేకపోయినప్పటికీ కోలీవుడ్ ఆమెకు బ్రహ్మరథం పట్టింది. అక్కడి దర్శక, నిర్మాతలు తమ చిత్రాల్లో నటించేందుకు హన్సికను ఎంపిక చేసుకొని కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదిగేలా చేశారు. ఇప్పుడామె కోలీవుడ్‌లో యమబిజీ..బిజీగానే కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఇదంతా ఓకే. అలాంటి కోలీవుడ్ నిర్మాతలకే ఈ బ్యూటీ చుక్కలు చూపిస్తోందిట. పేరుకు ఎవర్‌గ్రీన్ హీరోయినే కానీ.. తను నటిస్తున్న చిత్రాల నిర్మాతల జేబులకు చిల్లులు పడేలా చేస్తోందిట. తమ చిత్రాల్లో హన్సికను బుక్ చేసుకున్న నిర్మాతలకు ఖర్చు తడిసిమోపెడు అవుతుందట. దాదాపు తన రెమ్యూనరేషన్‌తో సమానంగా ఖర్చు పెట్టిస్తుందట ఈ బబ్లీబ్యూటీ. సినిమా షూటింగ్ సమయంలో ఈ బ్యూటీ ఖర్చులు అన్నీ ఫైవ్‌స్టార్ రేంజ్‌లోనే ఉంటాయట. ఫైవ్‌స్టార్ హోటల్లో రూములు.. ఫైవ్‌స్టార్ ఫుడ్.. ఇవికాక ఆమెతో పాటు ఈ ముద్దుగుమ్మకు స్ట్ఫా కూడా ఎక్కువేనట. హన్సికకు సుమారు పది మంది స్ట్ఫా ఉన్నారట. వారి ఖర్చులు కూడా నిర్మాత నెత్తిమీదనేనట! రానుపోనూ విమాన టికెట్స్ దగ్గర నుంచి మళ్లీ షూటింగ్ ప్యాకప్ చెప్పేవరకూ ఈ బ్యూటీ ఖర్చులు నిర్మాతల దిమ్మతిరిగేలా వున్నాయని కొంత మంది నిర్మాతలు లబోదిబోమంటున్నారట. ఈ అమ్మడి విషయం తెలుసుకున్న కోలీవుడ్ నిర్మాతలు హన్సిక పేరు చెబితేనే ‘వామ్మో..హన్సిక’అంటూ ఆమడదూరం పరుగులు పెడుతూ వణికిపోతున్నారట. అదీ..సంగతీ!!