'క్లాప్' కొట్టు గురూ!

వాహ్..సలోని!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండితెరపై ఎంతో వెలిగిపోవాలని..మరెంతో పేరు తెచ్చుకోవాలని ఆరాటపడని భామలుండరు. అయితే అందరికీ ఈ రంగుల ప్రపంచంలో నిలదొక్కుకునే అవకాశాలు రావు. అవి కొందరికి మాత్రమే రాసిపెట్టి వుంటాయి. నటి సలోని కూడా ఎన్నో కలలుకంది. నటిగా ఓ వెలుగు వెలిగిపోవాలనుకుంది. ఎన్నో ప్రయత్నాలు చేసింది. అవి ఏవీ ఈ అమ్మడికి కలిసిరాలేదు. దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి చేతిలో పడ్డా, ఫలితం లేకుండా పోయింది. ‘మగధీర’లో శ్రీహరితో ఓ పాటలో మెరిసిన సలోని అటు తర్వాత ‘మర్యాద రామన్న’లోనూ సునీల్‌తో జోడీ కట్టింది. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకున్నా, సలోనికి మాత్రం కెరీర్‌లో స్థిరపడేలా చేయలేకపోయింది. ఆ క్రెడిట్ అంతా దర్శకుడు రాజవౌళికే దక్కింది. అలా సలోని ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఇప్పుడు ఇక లాభం లేదనుకున్నట్లుంది.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వదులుకోకుండా చేయాలనుకుంటోందిట. పాత్రల విషయంలో ఆచి తూచి అడుగు వేయాలనుకున్న రూలేమీ పెట్టుకోకుండా, పెద్ద, చిన్న హీరోలంటూ చూడకుంటా వచ్చిన పాత్రల్లో నచ్చేట్టు జీవించాలనుకుంటోందిట. అందుకే ఇప్పుడు వస్తున్న అవకాశాలను ఇట్టే ఒప్పేసుకుంటోంది. కెరీర్‌లో ఎదగకపోతానా? అన్న ఆశ సలోనికి ఇంకావుంది. ఆ ఆశే ఆమెను ముందుకు నడిపిస్తోందిట. అదీ..విషయం. వాహ్..సలోని ఆల్ ది బెస్ట్!