'క్లాప్' కొట్టు గురూ!

వైవిధ్యమైనపాత్రల్లో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో ‘అలా..మొదలైంది’తో మొదలైన నిత్యామీనన్ వెండితెర ప్రయాణం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతూనే వుంది. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తూ తన కెరీర్‌ని చక్కగా మలుచుకుంటోంది. తొలి చిత్రంతోనే మంచి అభినయ సామర్థ్యం వున్న నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. బాల నటిగా కొన్ని చిత్రాల్లో నటించిన నిత్యామీనన్ ఆ తర్వాత జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత పూణే ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో సినిమాటోగ్రపీ చేద్దామని ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో దర్శకురాలు నందినీరెడ్డి కళ్లలో పడడంతో నటిగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ చిత్రం విజయంతో కన్నడ, మలయాళ భాషల్లో కూడా వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. కెరీర్ ఎలా వుంది అని నిత్యను కదిలిస్తే- ‘‘చాలా హ్యాపీగా వుంది. మంచి బ్యానర్‌లు.. మంచి చిత్రాలు.. అంతకంటే మంచి వైవిధ్యమైన పాత్రలు లభించడం వల్ల నాలోని నటి బయటికొచ్చింది. సినిమాటోగ్రాఫర్ కావాలన్న తన కోరిక తీరనప్పటికీ సినిమాకు దర్శకత్వం వహించాలనే కోరిక బలంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది నిత్య! వైవిధ్యమైన పాత్రల్లో మెరిసిపోవడమే కాదు.. ఇక నుంచి దర్శకత్వం వైపు కూడా రాణించాలనుకుంటోందిట. వాహ్..నిత్య ఆల్ ది బెస్ట్!!

-సమీర్