'క్లాప్' కొట్టు గురూ!

రూటు మార్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల తార కాజల్ అగర్వాల్ తన రూటును మార్చుకునే ప్రయత్నంలో పడిందట. సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా వెలుగొందుతున్న కాజల్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తన హవాను చాటుకున్న విషయం తెలిసిందే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాలసీని ఫాలో అవుతున్న ఈ అమ్మడు తాజాగా సినిమా రంగంతో పాటు బిజినెస్ రంగంలోనూ తన హవా చాటుకునేందుకు ప్రయత్నిస్తుందట. ఇప్పటికే కొందరు భామలు బిజినెస్ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు దూసుకెళుతుంటే వారి బాటలోనే కాజల్ కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందట. అయితే ఇప్పటికే కాజల్ కు జ్యువెలరీ బిజినెస్ ఉండగా ‘కాజల్ మర్సాలా’పేరుతో దీనిని నడిపిస్తుంది. ఇందుకు కావలసిన జ్యువెలరీను తన చెల్లెలు నిషా అగర్వాల్ డిజైన్ చేస్తుండగా, మిగతా పనులు తను చూసుకుంటున్నట్టు కాజల్ చెప్పుకొచ్చింది. సౌత్‌లో తమ జ్యువెలరీ బిజినెస్ విస్తరించే ఆలోచనలో తాను ఉన్నానని, దీంతోపాటు ‘సోషల్ కామర్స్ వెంచర్’ స్టార్టప్ చేసే ఆలోచన కూడా ఉందని పేర్కొంది. సో..ఇక బిజినెస్ రంగంపై దృష్టిసారించిన కాజల్ ఈ రంగంలో ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాల్సిందే మరి!

కిక్కు అంటే అదే..!
మిల్క్‌బ్యూటీ తమన్నా స్టయిలే వేరు. కెరీర్‌లో ఆమె వేసే ప్రతి అడుగు ఆచి తూచి ఉంటుంది. అందరి హీరోయిన్లలా కాక, తనకంటూ ఓ ప్రత్యేకత నిలుపుకోవాలన్నదే ఈ అమ్మడి ఆలోచనట! అందుకే చేసే చిత్రాల్లోని ఆమె పాత్రలే మనకు ఈ విషయాన్ని రుజువుచేస్తాయి కూడా. తమన్నా ఎన్నో సినిమాల్లో నటించినా ప్రభాస్ ‘బాహుబలి’లో తను పోషించిన అవంతిక పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఈ విషయం గురించి తమన్నాను కదిలిస్తే- ‘‘నిజమే..అవంతిక పాత్రను నేను ఎన్నటికీ మరచిపోలేను. నా జీవితంలో విమర్శ అనేది ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకునేందుకు తోడ్పడుతుంది. చాలా మంది అవంతిక పాత్రను బాగా చేశావని అంటుంటే ఎలా ఫీలయ్యానో మాటల్లో చెప్పలేను. చిత్రసీమలో విమర్శని స్వీకరించే ప్రక్రియ చాలా కీలకం. అందుకే ఎప్పటికప్పుడు నా నటనపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడంలోనే కిక్కు దొరుకుతుంది. అదే..మరి కిక్కంటే!’’అని చెప్పుకొచ్చిన తమన్నా తాజాగా ‘ఊపిరి’, ‘బాహుబలి-2’, ‘పాతాళ భైరవి’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలు విడుదలయ్యాక తమన్నా రేంజ్ ఎక్కడికెళుతుందో ఎవ్వరూ ఊహించలేరట!!

వాహ్..దీపికా!!
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె యమజోరుమీదుంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘బాజీరావ్ మస్తానీ’ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపి భారీ విజయాన్ని అందించడంతో ఆమె జోష్‌కు అవధుల్లేకుండాపోయింది. బాలీవుడ్ ప్రవేశించినప్పటి నుంచి దీపికా ఎంచుకుంటున్న చిత్రాలు, చేస్తున్న పాత్రలు ఆమెను తారాపథంలోకి తీసుకెళుతున్నాయి. కెరీర్‌ని ఎలా మలుచుకోవాలో ఈ భామకు బాగా తెలుసుకాబట్టే టాప్ హీరోయిన్ల లిస్టులోకి చేరడానికి ఎంతో కాలం పట్టలేదు. తోటి హీరోయిన్లకు ఇప్పుడు దీపికా అంటే యమ జలసీగా వుందట. అందుకు కారణం..దీపికా సాధిస్తున్న విజయాలేనంటున్నారు ఆమె సన్నిహితులు. బాలీవుడ్‌తోనే సరిపెట్టుకోకుండా హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చి తొలి చిత్రంలో నటిస్తూ అందర్నీ ఆశ్యర్యంలో పడేసింది. ఇంతటితో ఆగకుండా మరో హాలీవుడ్ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందట. ప్రముఖ హాలీవుడ్ స్టార్ విన్‌డీజిల్‌తో కలిసి ‘ఎక్స్ ఎక్స్ ఎక్స్’ అనే చిత్రంలో నటిస్తోన్న దీపికా తర్వాత చేయబోయే రెండవ హాలీవుడ్ చిత్రంలో హాలీవుడ్ స్టార్ బ్రాడ్‌పిట్‌తో జతకట్టనుందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే నిజమైతే ఇక హాలీవుడ్‌లోనూ వరుస ఆఫర్లు దీపికకే లభిస్తాయని అంటున్నారు.
**

-సమీర్