'క్లాప్' కొట్టు గురూ!

మళ్లీ..మళ్లీ...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాలతార నయనతారపై తాజాగా వస్తున్న రూమర్స్ ఆమెను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మళ్లీ..మళ్లీ..ఇలా పుట్టుకొస్తున్న పుకార్లపట్ల ఈ భామ తెగ ఇదైపోతుందట. తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ కథానాయికగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు వరుస ప్రేమాయణాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. శింబు, ప్రభుదేవాతో ప్రేమకు గుడ్‌బై చెప్పిన తర్వాత ఆమె ప్రస్తుతం యువ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో చనువుగా వుంటోందని గత కొంతకాలంగా కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి సెల్ఫీలు బయటికి రావడంతో వీరిపై వస్తున్న పుకారు నిజమేనని అంతా భావిస్తున్నారు. ఈ విషయంలో వీరిద్దరూ ఏ మాత్రం పెదవి విప్పలేదు. తాజాగా వీరిద్దరు రహస్యం వివాహం చేసుకున్నారని, ఆ విషయం బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు రూమర్. ప్చ్...ఏది నిజమో! ఏది అబద్ధమో!!

-సమీర్