'క్లాప్' కొట్టు గురూ!

ఇలియానా.. మజాకా!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్, కోలీవుడ్‌లలో వచ్చిన అవకాశాలను ఇట్టే అందిపుచ్చుకుని అదే స్థాయిలో తన స్టామినాను నిరూపించుకునే పాత్రల్లో అందాల కనువిందు చేసి తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంది గోవా బ్యూటీ ఇలియానా. వెండితెరపై అడుగుపెట్టినప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఈ ముద్దుగుమ్మకు రాలేదు. గ్లామర్‌తో కూడుకున్న పాత్రలను ఎంతో అవలీలగా పోషించి నటిగా మంచి మార్కుల్నే కొట్టేసింది. తెలుగులో అగ్ర హీరోల చిత్రాల్లో నటించిన ఈ అమ్మడి దృష్టి అటు తర్వాత బాలీవుడ్‌పై పడింది. ఎప్పటికైనా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకోవాలన్నదే ఇలియానా ఆశ. ఓ పక్క కెరీర్.. మరో పక్క ప్రేమాయణం ఇలా బిజీ బిజీగా వున్న ఈ అమ్మడు తాజాగా బాలీవుడ్‌లో ‘ముబారకన్’, ‘బాద్‌షా హూ’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఈ రెండు చిత్రాల్లో తన పాత్రలకు మంచి గుర్తింపు లభిస్తుందన్న ఆశ ఇలియానాలో వుంది. ఈ అమ్మడి బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోస్ ఓ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. ఇలియానాను తన కెమెరాలో బంధించడమంటే ఎంతో సరదా. ఇలా ఆమెతో ఎన్నో ఫొటోషూట్‌లు చేయించాడు కూడా. బాయ్‌ఫ్రెండ్ తీసిన ఎన్నో ఫొటోలు స్వయంగా ఇలియానానే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఈ ఫొటోల ద్వారా ఇలియానా అందాలతో పాటు ఆండ్రూ కెమెరా ప్రతిభ కూడా బయటపడుతుంటుంది. కొన్ని ఫొటోలో ఇద్దరూ కలిసి కూడా కనిపిస్తుంటారు. అలా ఇటీవల చేసిన ఓ ఫొటో షూట్ బాగా శృతిమించిందట. వీటిని ఇలియానా ఏ మాత్రం పట్టించుకోవడం లేదట. అయితే ఆండ్రూ, ఇలియానాలు ఇప్పటికే పెళ్లి చేసుకొన్నారని కొంతమంది చెబుతుంటే, కేవలం సహజీవనం మాత్రమే చేస్తున్నారని మరి కొందరి వాదన. ఈ విషయం గురించి ఇలియానాను కదిలిస్తే ఏ మాత్రం నోరువిప్పకుండా జర్రున అక్కడి నుంచి జారుకుంటుంది. అదీ..సంగతీ!! ఇలియానా.. మజాకా!!

-సమీర్