'క్లాప్' కొట్టు గురూ!

జోరుకు బ్రేక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో ‘అ..ఆ’, ‘ప్రేమమ్’, ‘శతమానంభవతి’ ఇలా వరుస విజయాలతో ముందుకు దూసుకెళుతున్న అందాలతార అనుపమ పరమేశ్వరన్ యమజోరు మీదుంది. టాలీవుడ్‌లో ఇప్పుడు అంతా యువ కథానాయికలదే హవా కొనసాగుతోంది. స్టార్ హీరోయిన్లు సైతం వీరి జోరును చూసి చెమటలు కక్కుతున్నారు. వారితో పోటీ పడలేకపోతున్నారు. ఇలాంటి యువతరం క్రేజీ భామలపై స్టార్ హీరోల దృష్టి కూడా పడింది. అలాండి భామల్లో అనుపమ కూడా వుంది. రామ్‌చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అందులో ఓ కథానాయికగా అనుపమని ఎంపిక చేసుకొన్నారు. మరో వైపు నాని హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో కూడా అనుపమనే కథానాయికగా ఓకే చేసేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ రెండు చిత్రాలు అనుపమ చేతిలో లేకుండాపోయాయని తెలిసింది. ‘కాల్షీట్లు సర్దుబాటు చేయలేక ఈ సినిమాలను వదులుకున్నా’నని అనుపమ చెబుతున్నా, దీని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందంటూ చిత్రసీమ భావిస్తోంది. ఏది ఏమైనా అనుపమ పరమేశ్వరన్ చేతిలో పడ్డట్టే పడి జారిపోయిన చిత్రాల గురించే ఇప్పుడంతా చర్చ జరుగుతోంది. ఏది నిజమో... ఏది అబద్ధమో తెలియక చిత్రసీమ ఆలోచనలో పడిపోయిందట. ప్చ్..అనుపమ జోరుకు ఈ విధంగా బ్రేక్ పడిందని అందరూ అనుకుంటున్నారు. అదీ..సంగతీ!!

-సమీర్