'క్లాప్' కొట్టు గురూ!

దటీజ్.. పూర్ణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ‘అల్లరి’ నరేష్‌కు జోడీగా ‘సీమ టపాకాయ్’తో అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ పూర్ణ. ఆ చిత్రంలో నరేష్‌కు సరిజోడీగా అతడితో ఆడిపాడి అలరించి నటిగా మంచి మార్కుల్ని కొట్టేసింది. ఆ చిత్రం ద్వారా పూర్ణకు మంచి పేరే వచ్చినప్పటికీ, ఆ తరువాత విజయం కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. కెరీర్‌లో ముందుకు సాగేందుకు ఆచి తూచి అడుగులు వేసినా టాలీవుడ్‌లో అనుకున్నన్ని అవకాశాలు మాత్రం ఆమె వద్దకు రాలేదు. అయినా పూర్ణలో ఏ మాత్రం ఆశ చావలేదు. ఎలాగైనా సరే నటిగా తెలుగు ప్రేక్షకుల మెప్పును పొందాలన్న గట్టి నిర్ణయానికొచ్చేసింది. అదే ఊపులో గ్లామర్ పాత్రల్లో మెరుపులు కురిపించినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. ‘అవును’, ‘రాజుగారి గది’లాంటి హారర్ సినిమాలే పూర్ణకు కాస్త ఊపిరి పోశాయి... అంతేకాదు, ఆ చిత్రాలు పూర్ణ కెరీర్‌కు ఎంతగానో దోహదం చేశాయి కూడా. ఆ సినిమాలే ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. కెరీర్‌లో ముందుకు పయనించేలా దారి చూపాయి. అటు అందానికీ, ఇటు అభినయానికి ప్రాధాన్యమున్న చిత్రాలపైకి ఈ అమ్మడి మనసు మళ్లింది. అలాంటి చిత్రాల్లో నటిస్తే నటిగా మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు కెరీర్ సాఫీగా సాగుతుందన్న ఆశ పూర్ణలో కలిగింది. అలాంటి ఆలోచనతోనే ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో రాణి పాత్రలో కనువిందు చేసింది. ఈ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పాత్రకు తగ్గట్టే అందంగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. అదే ఆమెకు ప్లస్ అయింది. ఈ చిత్రంలోని రాణి పాత్రను చూసిన ప్రతి ఒక్కరికీ వాళ్ల ఇళ్లలోని పెళ్లి కావాల్సిన పిల్లలు గుర్తుకొస్తారు. దర్శకుడు శివరాజ్ రాణి క్యారెక్టర్‌ను మలిచిన తీరు.. ఆ క్యారెక్టర్‌లో పూర్ణ ఒదిగిపోయిన వైనం.. ప్రతీ ఒక్కరినీ కట్టిపడేశాయి.. ఆద్యంతం కదలనీయకుండా చేశాయి. ‘‘ప్రేక్షకుల మెప్పు పొందాలంటే అన్ని రకాల పాత్రలు పోషించాలి. అలా పోషించినప్పుడే నటిగా మంచి పేరు లభిస్తుంది. సహజంగా హారర్ సినిమాలంటే నాకు చచ్చేంత భయం. నేను ఆ సినిమాలు చూడనే చూడను. అంతెందుకు నేను నటించిన ‘అవును’ సినిమాను కూడా థియేటర్‌లో చూడలేదు. టీవీలో చూశా. హారర్ అంటే భయమెందుకు అంటే.. కారణం ఇదీ అని నేను ఖచ్చితంగా చెప్పలేను. చిన్నప్పటి నుంచి నాకు దెయ్యం అంటే భయమే. నటీనటుల్ని తెరపై చూపించే బాధ్యత దర్శకులదే. వాళ్లెలా చెబితే అలా చేయాలి. మేం ఒట్టి బొమ్మలం మాత్రమే. ఆ బొమ్మలకు ప్రాణం పోసేది దర్శకులే. అది సరే.. మరి గ్లామర్ క్యారెక్టర్స్‌పై మీ అభిప్రాయం అని అడిగితే- ‘‘నటి అన్నాక అన్ని పాత్రలు పోషించాలి. ముఖ్యంగా గ్లామర్ పాత్రలను ఏ మాత్రం మిస్ చేసుకోకూడదు. గ్లామర్‌తో పాటు మంచి స్క్రీన్‌ప్లే వున్న కథా చిత్రాల్లో నటించాలి. చేసే ప్రతీ చిత్రంలో ఏదో కొత్తదనం కనిపించేలా చూసుకోవాలి. అయితే గ్లామర్ దుస్తుల్లో కన్నా చీరలోనే అందంగా కనిపిస్తా అని అందరూ అంటుంటారు. నాకూ అలాగే అనిపిస్తుంది. ప్రత్యేక గీతాల విషయానికొస్తే అభ్యంతరం లేదు కానీ, డ్యాన్స్ ఉన్న మసాలా ఐటమ్ సాంగ్స్‌లో మాత్రం కనిపించను. డ్యాన్స్‌యే నా జీవితం. చిన్నప్పటి నుంచే డ్యాన్స్ నేర్చుకోవడం ఆరంభించా. భరతనాట్యం, కూచిపూడి నాకు బాగా వచ్చు. నృత్య ప్రధాన చిత్రంలో అవకాశం వస్తే నాకు నృత్యం గురించి ఏదైనా చేయాలనుంది. అంతేకాదు, కాస్త టైం దొరికితే ఓ డ్యాన్స్ స్కూలును కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా మదిలో వుంది’’ అని సెలవిచ్చింది పూర్ణ.

-సమీర్