'క్లాప్' కొట్టు గురూ!

గ్లామర్ క్వీన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో కెరీర్‌లో యమ బిజీగా దూసుకెళుత్ను గ్లామర్ క్వీన్ రకుల్ ప్రీత్‌సింగ్. చేసే ప్రతీ చిత్రానికి తన గ్లామర్ డోస్‌ను పెంచుకుంటూ పోతోంది. పోషించే పాత్రల విషయంలోనూ రకుల్ స్టయిల్ రకుల్‌దే! దరిచేరిన ప్రతీ అవకాశాన్ని ఇట్టే ఒప్పేసుకోకుండా ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇప్పుడు టాలీవుడ్‌లో రకుల్ అంటే హాట్ హాటే..! యువతరం హీరోల నుంచి క్రేజీ నటులతో ఆడిపాడుతోంది. అయితే కేవలం గ్లామర్‌కే పరిమితమవుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ విషయం గురించి రకుల్‌ని ప్రశ్నిస్తే- ‘‘ అవును..నిజమే. తాజాగా నాకు వస్తున్న పాత్రలన్నీ గ్లామర్‌తో కూడుకునే వుంటున్నాయి. గ్లామర్ పాత్రలు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాం చెప్పండి? ఏ వయసులో చేయాల్సిన పాత్రలు ఆ వయసులోనే కదా చేయాలి. మరి అలాంటప్పుడు గ్లామర్..గ్లామర్ అంటూ ఎందుకు నన్ను ఆడిపోసుకుంటారు? మంచి మంచి బ్యానర్లు... అంతకంటే మంచి చిత్రాలు.. ఆయా చిత్రాల్లో నా పాత్రలు ఇవి చూసి నామీద ఈర్ష్య పెంచుకుంటున్నారు కొందరు. అలాంటివి నేను లెక్కచేయను. నాదారి నాదే’’అంటూ కుండ బద్దలు కొట్టేసింది. దటీజ్..రకుల్!!

-సమీర్