'క్లాప్' కొట్టు గురూ!

సో..లక్కీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో విద్యాబాలన్ చేసిన చిత్రాలు చూస్తే ఆమె ప్రతిభ ఇట్టే అర్థమవుతుంది. ఒకదానికి మంచి మరోటి ఆమె నటనా ప్రతిభను చూపిన చిత్రాలే. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విద్యను మించి మరొకరుండరంటే ఆశ్చర్యం లేదు. తాజాగా విద్యాబాలన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించబోతోంది. ప్రస్తుతం రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో ‘2.0’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన ‘కబాలి’ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకి జోడీగా విద్యాబాలన్‌ను ఓకే చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై విద్యను కలిసిన దర్శక, నిర్మాతలకు ఆమె ఈ చిత్రంపై ఆసక్తి చూపారని తమిళ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సో..కోలీవుడ్‌ళో విద్యాబాలన్ నటిస్తున్న తొలి చిత్రమిదే అవుతుంది. సో..లక్కీగాళ్ విద్య అన్నమాట!!

సమీర్