'క్లాప్' కొట్టు గురూ!

మరోసారి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోలీవుడ్ స్టార్ విక్రమ్ హీరోగా 2003లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సామి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుందో తెలిసిందే. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్‌తో జోడీ కట్టిన అందాలతార త్రిష క్యారెక్టర్‌కూ మంచి స్పందన లభించింది. విక్రమ్-త్రిష జంట ప్రేక్షకులకు కనువిందు చేసింది. అయితే ఇదే జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అదే దర్శకుడి చిత్రం ‘సామి-2’ తెరకెక్కబోతోంది. ఏప్రిల్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందట. ఇందులో విక్రమ్‌తో త్రిష మరోసారి ఆడిపాడబోతోంది. ఈ విషయాన్ని త్రిష స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. శిబు థమీన్ నిర్మాతగా వ్యవహరిసున్న ఈ చిత్రానికి హరీస్ జయరాజ్ స్వరాలు సమకూర్చనున్నారు. ‘ఇరుముగన్’ చిత్రంతో విజయాన్ని అందుకున్న విక్రమ్ ‘సామి-2’కి సైన్ చేశారు. ‘కోడి’తో గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన త్రిష ప్రస్తుతం ఏడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఇలా మరోసారి విక్రమ్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా ఎలా వుండబోతుందో చూడాల్సిందే.

-సమీర్