'క్లాప్' కొట్టు గురూ!

థ్రిల్ అంటే అదే మరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో ‘హార్ట్‌ఎటాక్’తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది అదాశర్మ. బాలీవుడ్ చిత్రాలతో వెండితెరపై అడుగుపెట్టినప్పటికీ ఎక్కువగా ప్రాంతీయ భాషల్లోనే నటించే అవకాశం వచ్చింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘క్షణం’లాంటి సినిమాలతో నటిగా మంచి మార్కుల్నే కొట్టేసింది. అయితే చాలా విరామం తర్వాత మళ్లీ బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతోంది. అదే ‘కమాండో-2’. గతంలో పోషించిన పాత్రలకంటే ఈ చిత్రంలోని క్యారెక్టర్ పూర్తి భిన్నంగా వుండి అందర్నీ కదిలించి ఆలోచింపజేస్తుందని చెబుతోంది ఈ అమ్మడు. తన ఆలోచన అంతా బాలీవుడ్‌పైనే. అక్కడే ఎక్కువ చిత్రాలు చేసి జాతీయంగా మంచి నటిగా గొప్ప పేరు తెచ్చుకోవాలన్నదే ఆమె తపనట. ‘1920’ చిత్రంలో ఓ మంచి క్యారెక్టర్‌ని పోషించింది. ఇంత వరకు తను చేసిన పాత్రలను ప్రేక్షకులు బాగానే ఆదరించారు. కానీ ఎందుకో అనుకున్నంత రేంజ్ మాత్రం అదాకు దరిచేరలేదు. కారణాలు ఏమైనప్పటికీ అదృష్టం ఆమె తలుపు తట్టలేదనే చెప్పాలి. ఈ విషయం గురించి అదాశర్మ వివరిస్తూ- ‘‘ నేను గతంలో పోషించిన పాత్రలన్నింటీకి తాజా ‘కమాండో-2’ని క్యారెక్టర్ పూర్తి భిన్నంగా వుంటుంది. ఇందులో మొదటిసారిగా నాలోని కామెడీ కోణాన్ని చూస్తారు. ఈ చిత్రంలో నల్లధనాన్ని బయటపెట్టేందుకు ఓ వైపు సీరియస్ మిషన్ జరుగుతుంటే.. అందులో భాగమైనప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ఫొటోలు దిగటం..షాపింగ్‌కు వెళ్లడమే చేస్తుంటా. క్యారెక్టర్‌లో లీనమై చేస్తుంటే నన్ను నేనే మరిచిపోయా. బాలీవుడ్‌లో మరిన్ని మంచి చిత్రాలు చేసి బాగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా. ఇప్పుడిప్పుడే మంచి సినిమాలు చేసే అవకాశం వస్తోంది. ఇక బిజీ బిజీగానే కెరీర్ ఉండబోతుందన్న ఆశ వుంది’’అంటూ చెప్పుకొచ్చింది అదాశర్మ. సరేలే..చెప్పడానికేముంది? ఎన్నయినా చెబుతుంది. చెప్పింది అమలు జరిగినప్పుడే కదా థ్రిల్. ఏమంటారు? థ్రిల్ అంటే అదే కదా మరి!!

-సమీర్