'క్లాప్' కొట్టు గురూ!

యమజోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నటి అన్నాక అన్ని భాషల్లో నటించాలి. నటనకు భాషాబేదం అంటూ ఏదీ లేదు. అవకాశాలు ఎక్కడ వచ్చినా చేయాలి. అలాంటప్పుడే ఓ నటికి మంచి గుర్తింపుతో పాటు తన కెరీర్ కూడా ఆశాజనకంగానే సాగుతుంది అనేది నా గట్టినమ్మకం’’అని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి. ప్రస్తుతం నటులు భిన్నమైన పాత్రల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు, ప్రయోగాత్మక పాత్రలపై దృష్టిసారిస్తున్నారు. ఇదే దారిలో హ్యూమా ఖురేషి కూడా చేరింది. తను ఏదో ఒక జోనర్ చిత్రాలకి పరిమితం కావాలని అనుకోవడం లేదట. ఓ నటిగా ఫలానా సినిమాల్లోనే నటించాలని రూలేమీ పెట్టుకోలేదట. అలాగే ఒకే జోనర్‌లోనే నటించాలని..అందులోనే తనకు గుర్తింపు రావాలని అనుకోవడం లేదట. తనకు నచ్చిన ప్రతీ పాత్రలో నటిస్తుందట. అందులోనే ఆమెకు ఎంతో సంతోషం ఉంటుందట. అలాగే కేవలం సినిమాలకే పరిమితం కావాలని కూడా అనుకోవడం లేదట. ఈ బ్యూటీ నటించిన ఓ అంతర్జాతీయ చిత్రం ‘విక్టోరియా హౌస్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ద్వారా హ్యూమా ఖురేషి ఎంతో నేర్చుకుందట. ఈ విషయం గురించి హ్యూమాను కదిలిస్తే- ‘‘ అంతర్జాతీయ చిత్రంలో నటించడం ఓ సవాల్ లాంటిదే. అయితే దీని ద్వారా చాలా విషయాలు తెలుస్తాయి. అది ఓ రకమైన సంతోషాన్నిస్తుంది’’ అని చెప్పుకొచ్చింది. అలాగనీ..్భరత్‌ను విడిచివెళ్లి వేరే దేశంలోని సినిమాల్లో నటించడం ఒక్కటే తన పనికాదని కూడా సెలవిచ్చింది. మొత్తం మీద హ్యూమా యమజోరుమీదనే వుంది!

-సమీర్