'క్లాప్' కొట్టు గురూ!

వాహ్.. కాజల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాలభామ కాజల్ అగర్వాల్ తాజాగా టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నెం.150’ చిత్రంలో నటించి మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చినా అవకాశాలు మాత్రం ఆమెను చేరలేకపోతున్నాయి. ఈ సినిమాలో చేస్తున్నప్పుడు ఆమెలో ఎన్నో ఆశలు.. అవన్నీ ఇప్పుడు నీరుగారిపోయాయి. తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోలందరి సరసన నటించి కథానాయికగా మంచి మార్కుల్నే కొట్టేసింది. అటు తర్వాత బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. అయితే ఈ రెండు చోట్లా తాజాగా ఆమె కెరీర్ ఆశాజనకంగా లేదు. కాజల్ అనుకున్నవేవీ నెరవేరకపోగా, అవకాశాలు కూడా పూర్తిగా సన్నగిల్లిపోయాయి. ఇక లాభం లేదనుకున్న కాజల్ కథానాయిక ప్రాధాన్యతతో కూడుకున్న కథలపై దృష్టి సారించాలనుకుంటోందిట. ఇటీవల సీనియర్ భామలంతా ఈ విధంగానే ఆలోచిస్తూ అడుగులు ముందుకేస్తున్న విషయం కొంత ఆలస్యంగానైనా కాజల్‌కు బాగానే తెలిసొచ్చినట్లుంది. నటనలో కొత్తదనం ప్రదర్శించేందుకు ఇలాంటి పాత్రలు బాగా పనికొస్తాయన్నది వీరి గట్టి నమ్మకం. అందుకే ఇలాంటి అవకాశాలు రాగానే వెంటనే ఓకే చెప్పేస్తున్నారు ఈ బ్యూటీలు. క్రేజీ తార అనుష్క, ముద్దుగుమ్మ నయనతారలాంటి కథానాయికలు ఇలాంటి కథలతో సంపాదించిన పేరుని చూశాక మిగతా తారలు కూడా వీటిపైనే మక్కువ పెంచుకుంటున్నారు. అలాంటి చిత్రాల్లోనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. అందుకే కాజల్ అగర్వాల్ కూడా ఇలాంటి క్యారెక్టర్‌ను చేయబోతున్నట్లు సమాచారం. అదీ..బాలీవుడ్‌లోనట! హిందీలో ఓ దర్శకుడు ఇలాంటి కథతో ముందుకొస్తే దీనికి కాజల్ వెంటనే ఓకే చెప్పేసిందట. ముందుగా ఈ క్యారెక్టర్ నయనతారను దరిచేరితే ఆమె కాల్షీట్లు సర్దుబాటు చేయలేకపోయిందిట. దాంతో ఈ అవకాశం కాస్త కాజల్‌ని వరించిందట. ప్రస్తుతం కాజల్ చేతిలో సినిమాలేమీ లేవు. అందుకే ఎలాగైనా ఇందులో నటించి తన ప్రతిభను చూపాలనుకుంటోందిట. సో..నటించడానికి రెడీ అయిపోయిందిట.
వాహ్.. కాజల్ ఆల్ ది బెస్ట్!!

-సమీర్