'క్లాప్' కొట్టు గురూ!

జోరుగా.. హుషారుగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవును.. ఇప్పుడు శృతిహాసన్ జోరుగా..హుషారుగా వుంది. అందుకు కారణం లేకపోలేదు.. పవన్‌కళ్యాణ్‌కు జోడీగా తొలిసారిగా ‘గబ్బర్‌సింగ్’లో ఆడిపాడింది. ఆ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఆ విజయంలో శృతిహాసన్ పాత్రకూ మంచి మార్కులే పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద జోరుగా కలెక్షన్లు రాబట్టిన ఆ చిత్రంలో నటించిన నటీనటులకూ మంచి ఇమేజే వచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి పవర్‌స్టార్‌తో ఈ అందాలభామ జోడీ కడుతోంది. వీరిద్దరూ కలిసి ‘కాటమరాయుడు’ చిత్రంలో మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో శృతి క్యారెక్టర్ తొలి చిత్రంలో కంటే మరింత ఎక్కువ పాళ్లలో వుంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. పవన్‌కళ్యాణ్‌తో రెండోసారి చేయడమంటే మాటలు కాదు.. చేతలు కావాలి. ఆ చేతలే శృతిహాసన్‌కు వుండబట్టే ఈ అవకాశం ఆమెను వరించింది. ఎంతో హుషారుగా షూటింగ్‌లో పాల్గొంటున్న శృతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట.

-సమీర్