'క్లాప్' కొట్టు గురూ!

ఆత్మగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ అనుష్కశర్మ నటించిన ‘పీకే’, ‘సుల్తాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని అందుకోవడంతో మంచి ఊపుమీదుంది. బాలీవుడ్‌లో ఇప్పుడు అనుష్కశర్మ అంటే యమక్రేజీ. ఆమె నిర్మాతగా తెరకెక్కిస్తున్న రెండో చిత్రం ‘్ఫలౌరి’. ఇందులో అనుష్క ఆత్మగా నటించింది. కెరీర్ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే మంచి పాత్రలను ఎంపిక చేసుకుంటోంది. స్లో అండ్ స్టడీగా సాగిపోతున్న ఈ అమ్మడి కెరీర్ మంచి రేంజ్‌లో వుంది. ఆత్మగా నటిస్తున్న ‘్ఫలౌరి’ ప్రచారంలో భాగంగా అందర్నీ కలుసుకొని తన మనసువిప్పుతోంది. ఎక్కడికెళ్లినా మీడియా మాత్రం ఆమెను పదే పదే అడిగిన ప్రశ్నలే అడుగుతూ తెగ ఇబ్బంది పెడుతున్నా, అవి ఏ మాత్రం పట్టించుకోకుండా తన సహజధోరణిలో ఓ చిరునవ్వు విసురుతోందిట. ‘‘ఏవైనా కొత్తవి అడగండి.. సరదాగా వుంటుంది. ఎప్పుడూ రొటీన్ ప్రశ్నలేనా?’’అంటూ ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ అక్కడి నుంచి తప్పించుకుంటుందిట. దటీజ్..అనుష్కశర్మ!!

-సమీర్