'క్లాప్' కొట్టు గురూ!

జోరు జోరుగా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ కత్రీనాకైఫ్ యమజోరుమీదుంది. తన కెరీర్‌ని అదే జోరుతో హుషారుగా మలుచుకుంటోంది. తాజాగా సల్మాన్‌ఖాన్‌కు జోడీగా ‘టైగర్ జిందాహై’లో హొయలు ఒలకబోస్తోన్న ఈ ‘కైఫ్’ మరో ఖాన్‌తోనూ చెట్టాపట్టాలేయడానికి సిద్ధమవుతోందిట. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో షారుఖ్‌ఖాన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో కత్రీనాకైఫ్‌ని కథానాయికగా ఎంపిక చేసుకున్నారట. ‘జబ్ తక్ హై జాన్’తో అలరించిన ఈ జంట ఇప్పుడు మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. మీరట్ నుంచి అమెరికా వరకు సాగిన ఓ వ్యక్తి ప్రయాణమే ఈ చిత్రం. ఈ ప్రయాణంలో కీలకమైన సమయంలో కత్రీనా పాత్ర ప్రవేశిస్తుందట. ఈ పాత్ర కత్రీనాకు యమ క్రేజీని తెచ్చిపెడుతుందని దర్శకుడు చెబుతున్నారు. దటీజ్..కత్రీనా!!

-సమీర్