'క్లాప్' కొట్టు గురూ!

బిజీ బిజీగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ ప్రగ్యా జైస్వాల్ ‘కంచె’లో కనువిందు చేసి టాలీవుడ్ ప్రేక్షకుల్ని తన నటనతో ఆకట్టుకుంది. ఆ చిత్రం తర్వాత వరుస అవకాశాలతో బిజీ బిజీగా కెరీర్‌లో ముందుకు దూసుకెళుతోంది. తాజాగా ఈ భామ కృష్ణవంశీ ‘నక్షత్రం’లో ఓ కీలక పాత్రను పోషిస్తోంది. అంతేకాదు, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రంలోనూ కథానాయికగా చేస్తోంది. వీటితో పాటు మరో అవకాశం కూడా ఈ అమ్మడి ఖాతాలో చేరింది. అదే మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’.
ఇందులో విష్ణుకు జోడీగా వెరైటీ పాత్రల్లో కనిపించనుందట. గతంలో ‘గుంటూరోడు’లో మంచు మనోజ్‌తో జోడీ కట్టింది. ఆ చిత్రం నటిగా ప్రగ్యా జైస్వాల్‌కు మంచి మార్కుల్నే తెచ్చిపెట్టింది. ఇలా వరుస అవకాశాలతో కెరీర్‌లో దూసుకెళుతున్న ఈ అమ్మడు ఎంపిక చేసుకుంటున్న పాత్రల్లో దమ్ము ఉంటోందని చిత్రసీమకు చెందిన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే మరి.. ఇలాంటి వరుస అవకాశాలు ఆమెను చేరుతున్నాయి.

-సమీర్