'క్లాప్' కొట్టు గురూ!

తెలుగువైపే చూపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ స్టిల్ బాగా చూడండి! కన్నడం నుంచి వచ్చి తెలుగులో అగ్రస్థాయికి ఎదిగిన ఓ నటి ఈమెలో కన్పిస్తుంది కదూ! నిజమే.. ఈమె కన్నడ నటి శ్రద్ధా శ్రీనాధ్. కన్నడలో ఒకే ఒక్క చిత్రం ‘యు టర్న్’లో నటించింది. ఆ ఒక్క చిత్రంలో గ్లామర్‌కు ప్రాధాన్యత ఇవ్వకున్నా, ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సినిమా హిట్టవ్వడంతో తక్కువ కాలంలోనే బిజీ హీరోయిన్ అయిపోయింది. కన్నడ నుంచి తెలుగులోకి షార్ప్ టర్న్ తీసుకుంది. మొదట ఈమెను చూసినవాళ్ళు తొలి సినిమా హిట్ కాగానే తెలుగులో ఎంట్రీ ఇస్తుందనుకున్నారు. కానీ కొంచెం లేట్‌గా వస్తోంది. రవికాంత్ పేరెపు దర్శకత్వంలో క్షణం సినిమా గుర్తుందిగా. ఆ చిత్రంలో నటించిన జొన్నలగడ్డ సిద్ధుతో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం శ్రద్ధా శ్రీనాథ్ ఎంపికైంది. ఈమెను చూస్తుంటే ప్రత్యేకంగా గ్లామర్ చిందించాల్సిన అవసరంలేదని, నటనలోనూ తన సత్తా చాటుతున్న శ్రద్ధ త్వరలోనే బిజీ అయిపోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

-సమీర్