'క్లాప్' కొట్టు గురూ!

ఆశల పల్లకిలో...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రెగ్యులర్ పాత్రలకన్నా భిన్నంగా నటించడానికి స్కోప్ ఉన్న పాత్రలే నాకు నచ్చుతాయి. ప్రస్తుతం మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నా. ప్రతి సినిమాను ఆస్వాదిస్తూ పనిచేయాలనుకుంటున్నా. కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేస్తా. అవి గ్లామర్ పాత్రలు కూడా కావొచ్చు. హిందీ ‘బేగం జాన్’లో నాది పూర్తి డీగ్లామర్ క్యారెక్టర్’’అని ఎంతో ఆనందగా చెప్పుకొచ్చింది అందాల భామ మిస్తీచక్రవర్తి. టాలీవుడ్‌లో ‘చిన్నదాన నీకోసం’తో ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన ‘బాబు బాగా బిజీ’ చిత్రంలో నటించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో మిస్తీచక్రవర్తి నటనకు మంచి మార్కులే పడ్డాయి. కథానాయికగా ప్రత్యేక లక్ష్యాలంటూ తనకేమీ లేవని, కలల పాత్రంటూ లేదని, కానీ తాను ఎంచుకునే పత్రీ పాత్ర కొత్తగా ఉండాలని కోరుకుంటానని చెబుతున్న మిస్తీ టాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని ఎంతగానో ఆశపడుతోంది. ఈ అమ్మడి ఆశ నెరవేరాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ మిస్తీ!

-సమీర్